పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్రం ఇథనాల్ బ్లెండింగ్ ఈ20 పెట్రోల్ మీద ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. దేశంలోని వాహనదారులు ఈ20 పెట్రోల్ ఉపయోగిస్తే క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గడంతో పాటు దేశీయ పెట్రో అవసరాలు తీరుతాయని భావించింది.కాగా, ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ వాడిన వాహనాల్లో సమస్యలు వస్తున్నాయని, మైలేజ్ పడిపోతుందని, స్పేర్ పార్ట్స్ దెబ్బతింటున్నాయని వాహనదారుల నుంచి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
ఈ10 ఉండాల్సిందే..
ఈ క్రమంలోనే 2021లో నీతిఆయోగ్ రిపోర్టు కేంద్రానికి ఇచ్చిన నివేదికలోని సారాంశం ఒక్కసారిగా వైరల్ అయ్యింది. చాలా దేశాల్లో ఈ20 పెట్రోల్ వాడుతున్నా.. ఈ 10 కూడా వినియోగంలో ఉంచారని.. ఎందుకంటే 2022 కంటే ముందు వాహనాలు ఇథనాల్ సపోర్టు చేయలేవని, లేదంటే వాహనాల్లో మార్పులు చేయాల్సి వస్తుందని పేర్కొంది. ఈ 10 మాత్రం పూర్తిగా వాడకం నుంచి తొలగించవద్దని స్పష్టంచేసింది. ఎందుకంటే 2022 కంటే ముందున్న వాహనాలు అన్నింటిలో ఈ20కి తగినట్టు మార్పులు చేయడం అంత త్వరగా సాధ్యపడదని కూడా నీతి ఆయోగ్ కేంద్రానికి తెలిపినట్టు సమాచారం.
ఈ 20 తర్వాత ఈ21 నుంచి ఈ25..
దేశీయ ఇంధన విధానంలో కేంద్రం మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది.దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన ‘E20’ పెట్రోల్‌ను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. తాజాగా E21- E25 పెట్రోల్ అమలుపై దృష్టి సారించినట్లు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. 2027 నాటికి 21 శాతం ఇథనాల్‌తో కూడిన E21 పెట్రోల్‌ను, అలాగే 2029 నాటికి 25 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన E25 పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా వాడుకలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం వలన ముడి చమురు దిగుమతులు తగ్గించి, దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయాలని మోడీ సర్కార్ చూస్తున్నట్టు తెలుస్తోంది.












