సినిమా

మిమి' షూటింగ్‌లో కృతి చేసిన సీక్రెట్ పని.. తొలిసారి బయటపెట్టిన రహస్యం!..

రచన: Desk 24 నిమిషాల పఠనం

వ్యక్తిగత జీవితంలోనూ, కెరీర్‌లోనూ ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటూ కృతి సనన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె చెప్పిన ఈ అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కృతి సనన్ తాజాగా తన జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టిన మిమి సినిమా షూటింగ్ సమయంలో తన అండాలను ఫ్రీజ్ చేసి భద్రపరచుకున్నట్లు తెలిపింది.

ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదని తెలిపిన కృతి సనన్.. మొదటి సారి తన అభిమానులతో పంచుకుంటున్నట్టు తెలిపారు. ఇక మిమి కోసం బరువు పెరగాల్సి వచ్చింది. అందుకోసం ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాల్సి రావడంతో కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయి.

అదే సమయంలో ఓ వ్యక్తి.. అండాలను ఫ్రీజ్ చేయించడం అనేది మీ భవిష్యత్తుకు మీరు ఇచ్చుకునే గొప్ప బహుమతి అని చెప్పాడు. ఆ మాట నా మనసులో నిలిచిపోయింది. షూటింగ్ ప్రారంభమయ్యాక ఇదే సరైన సమయమని భావించి ఆ నిర్ణయం తీసుకున్నానని వివరించింది.

సాధారణంగా ఇలాంటి పాత్రల కోసం శరీరంలో మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. కొన్నిసార్లు హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి రావడం, బరువు పెరగడం వంటి కారణాలతో భవిష్యత్తులో గర్భధారణపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

అందుకే ఇప్పుడు చాలామంది మహిళలు తమ అండాలను ఫ్రీజ్ చేసి భద్రపరుచుకునే విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఇక మిమి సినిమా కథ కూడా ఇదే అంశానికి దగ్గరగా ఉంటుంది. తన కలలను నెరవేర్చుకోవడానికి డబ్బు అవసరమైన మిమి అనే యువతి సరోగసీకి అంగీకరిస్తుంది.

కానీ అనూహ్య పరిస్థితుల్లో విదేశీ జంట ఆ బిడ్డను తీసుకోవడానికి నిరాకరిస్తుంది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన మిమి ఎలాంటి అవమానాలు, సవాళ్లు ఎదుర్కొంది? చివరకు ఆ బిడ్డకు జన్మనిచ్చిందా? తన జీవితాన్ని ఎలా మార్చుకుంది? అనే భావోద్వేగ ప్రయాణమే మిమి చిత్ర కథ.

మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ, కెరీర్‌లోనూ ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటూ కృతి సనన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె చెప్పిన ఈ అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

#bollywood#mimi#move#Kriti Sanon#secret#eggs
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి