సినిమా

Yellamma: ఈ సస్పెన్స్ ఇంకా ఎన్నాళ్ళు..?

రచన: Desk 74 నిమిషాల పఠనం

Yellamma: ఎల్లమ్మ సినిమా విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బలగం సినిమా తర్వాత వేణు ఎల్దండి చేస్తున్న సినిమా కావడంతో బాగానే హైప్ వచ్చింది. నిర్మాత దిల్ రాజు కావడం మరో హైలెట్. మొదట ఈ సినిమాలో హీరోగా నాని అన్నారు. కథ తయారు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఏమైందో గానీ, ఈ ప్రాజెక్ట్ నుంచి నాని తప్పుకున్నాడు. అంతే, అప్పటి నుంచి ఎల్లమ్మ సినిమాలో హీరో గురించి దిల్ రాజు బృందం ఊదరగొడుతూనే ఉంది.

ఒక దశలో నితిన్ హీరోగా కన్‌ఫర్మ్ చేశారు. హీరోయిన్‌గా కీర్తి సురేష్ కూడా కన్‌ఫర్మ్ అన్నారు. దిల్ రాజు ఒకేసారి రౌడీ జనార్ధన, ఎల్లమ్మ సినిమాల కోసం కీర్తి సురేష్ ని బల్క్ డేట్స్ అడిగితే ఓకే చెప్పింది కూడా. కానీ, ఫైనల్‌గా హీరో దేవిశ్రీప్రసాద్ అనగానే హీరోయిన్ కీర్తి సురేష్ తప్పుకుంది. ఓ ప్రెస్‌మీట్‌లో తానే స్వయంగా ఎల్లమ్మ చేయడం లేదని తేల్చిపారేసింది.

ఆ తర్వాత హీరోయిన్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దేవిశ్రీప్రసాద్ మాత్రం ఈ సినిమా కోసం పాటల రికార్డింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆయా షేర్ పాడిన జంగిరెడ్డి తో కూడా ఓ పాటను పాడించాడట. ఇక, ఇన్‌సైడ్ టాక్ ప్రకారం కీసరగుట్ట ప్రాంతంలో ఎల్లమ్మ సినిమా కోసం ఓ అమ్మవారి టెంపుల్ సెట్ ని వేసి కీలకమైన సన్నివేశాలను దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్నాడట.

ప్రకాష్ రాజ్, ఉత్తేజ్ సహా పలువురు కీలక పాత్రధారులపై ప్రధానమైన సన్నివేశాలను పగలు, రాత్రి చిత్రీకరిస్తున్నారట. కొంత టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. మరి, హీరోయిన్ విషయంలో ఎప్పుడు సస్పెన్స్ రివీల్ అవుతుందో చూడాలి. దేవిశ్రీప్రసాద్ పక్కన అంటే కాస్త ఏజ్ ఉన్న హీరోయిన్‌నే సెలెక్ట్ చేయాలి. సమంత, సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, రుక్మిణి వసంత్..ఇలా ప్రచారంలో పలువురు పేర్లు వినిపించాయి. వీరెవరైనా దేవికి జోడీగా బావుంటారు. అయితే, నిర్మాత దిల్ రాజు మైండ్ ఉన్న హీరోయిన్ ఎవరనేది తెలియడం లేదు.

#yellamma#venu eldhandi#devisriprasad#dilraju
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి