రాజకీయాలు

Congress : కొండాకు మరో‌ బిగ్‌షాక్.. దేవాదాయ శాఖపై ‘కడియం’ రివ్యూ..!

రచన: Desk 13 నిమిషాల పఠనం

కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలు పెట్టుకున్నట్టు సమాచారం.ఎందుకంటే నేతల మధ్య అస్సలు సమన్వయం లేదని టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలు పెట్టుకున్నట్టు సమాచారం.ఎందుకంటే నేతల మధ్య అస్సలు సమన్వయం లేదని టాక్ వినిపిస్తోంది. ఒకరిమీద మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి, పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నారే తప్పా.. పార్టీ నాయకత్వం, సీఎం రేవంత్ ఆదేశాలను అనుసరిస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసే వారు కనిపించడం లేదని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

ఎందుకంటే తాజా పరిణామాలు అందుకు అద్దం పడుతున్నాయి. మంత్రి కొండా సురేఖకు తెలియకుండా దేవాదాయ శాఖ కమిషనర్‌తో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎండోమెంట్ రివ్యూ నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంబంధిత దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండా ఒక ఎమ్మెల్యే ఎలా రివ్యూ నిర్వహిస్తారని టాక్ నడుస్తోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్‌లో కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించినట్టు తెలుస్తుండగా..

శాఖా మంత్రినైన తనకే తెలియకుండా కడియం రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కడియం శ్రీహరిపై స్టేట్‌ కమాండ్‌కి కాకుండా నేరుగా హైకమాండ్‌కి కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే, తనకు చెప్పకుండా హైకమాండ్‌కి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్ ఆరా తీయగా.. హైకమాండ్‌కు రాసిన లేఖను బహిర్గత పరచొద్దని మంత్రి కొండాకు మహేష్ కుమార్‌ గౌడ్‌ సూచించినట్టు సమాచారం.

https://x.com/TeluguScribe/status/2074396583089828174?s=20

#minister konda sureka#mla kadium srihari#review#complaint#congress#state and aicc
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి