#VenkyAnil5: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ తో థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగా నవ్వించారో గత చిత్రాలలో చూశాము. మెగాస్టార్ తో అనిల్ రావిపూడి తీసిన మన శంకరవరప్రసాద్‌గారు ఫ్యాన్స్‌తో పాటు ప్రతీ ఒక్కరినీ బాగా ఎంటర్‌టైన్ చేసింది. ఇప్పుడు దానికి రెట్టింపు స్థాయిలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ల సినిమా ఉంటుందని చూపించడానికి మరో మల్టీస్టారర్ మూవీ రెడీ అవుతోంది.
ప్రస్తుతం ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్స్ గా #VenkyAnil5, #NKRAR2 పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మధ్యనే కల్యాణ్ రామ్‌పై ఓ సాంగ్ ని కంప్లీట్ చేశారు. ఈ క్రమంలో సినిమాకి ఎంతో కీలకమైన నెక్స్ట్ షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. ఈ మూవీ సెట్స్‌లోకి విక్టరీ వెంకటేష్ ఎంటరయ్యాడు. సినిమాలో ఉన్న ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. దీని కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ ను కూడా వేశారు. ఈ సెట్‌లోనే ప్రస్తుతం వెంకటేష్, కల్యాణ్ రామ్‌లతో పాటు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టిలపై ముఖ్యమైన సన్నివేశాలను రావిపూడి షూట్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో వెంకటేష్, కల్యాణ్ రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు మెయిన్ హైలైట్‌గా నిలవనున్నాయట. అనిల్ రావిపూడి తన మార్క్ హ్యూమర్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిస్తున్నాడు. వెంకటేష్ సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ కి జంటగా కృతి శెట్టి నటిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో, నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పకులు. మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమాను 2027 సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.












