రాజకీయాలు

Congress : మంత్రి కొండా VS కడియం.. మళ్లీ రాజుకున్న వివాదం!

రచన: Desk 13 నిమిషాల పఠనం

కాంగ్రెస్‌లో మరోసారి మంత్రి, మాజీ మంత్రి మధ్య వివాదం రాజుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ పార్టీ వ్యవహారాలు చూస్తుంటారు. ఆమె కేబినెట్ మంత్రి.

కాంగ్రెస్‌లో మరోసారి మంత్రి, మాజీ మంత్రి మధ్య వివాదం రాజుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ పార్టీ వ్యవహారాలు చూస్తుంటారు. ఆమె కేబినెట్ మంత్రి. అయితే, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం శ్రీహరి జిల్లాలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చర్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది.

గతంలో ఈ ఇద్దరి మధ్య వివాదం రాజుకోగా..టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీపీ పెద్దలు సయోధ్య కుదిర్చారు. తాజాగా మరోసారి వీరిమధ్య కొత్త పంచాయితీ షురూ అయినట్టు సమాచారం. దీనికి మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైఖరే కారణమని సమాచారం. సోమవారం కడియం శ్రీహరి తన నియోజకవర్గంపై అధికారులతో రివ్యూ చేయడమే కాకుండా, ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను కోరడంతో మరోసారి ఇద్దరి మధ్య రాజకీయం రాజుకుంది. జిల్లా వ్యవహారాలలో కడియం తల దూర్చడం ఏంటని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే కడియం విషయంపై ఏఐసీసీ పెద్దలకు, సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి లేఖ రాసినట్టు తెలుస్తోంది.

https://x.com/TeluguScribe/status/2074373964991000917?s=20

#minister konda sureka#mla kadium srihari#political#war#congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి