తెలంగాణ

Farmers : యాప్‌లో కొత్త రూల్స్.. ఎకరానికి రెండే యూరియా బస్తాలు!

రచన: Desk 13 నిమిషాల పఠనం

రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వర్షాలు లేక మరోవైపు యూరియా సకాలంలో అందక నానా అవస్థలు పడుతున్నారు.ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వర్షాలు లేక మరోవైపు యూరియా సకాలంలో అందక నానా అవస్థలు పడుతున్నారు.ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. జులై నెల వచ్చినా రాష్ట్రంలో వర్షాల జాడ లేదు. చుట్టుపు చూపుగా వర్షాలు వచ్చి వెళ్తున్నాయి. దీంతో పంట మార్పిడి చేయాలని రైతాంగం చూస్తున్నది. వరికి బదులు పత్తి, కందులు, పప్పు దినుసులు సాగు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. అయితే, వారికి ఇప్పుడు యూరియా సమస్యల తలకు మించిన భారంగా మారింది.

వ్యవసాయ కేంద్రాల వద్ద యూరియా దొరకడం లేదు. యాప్‌లో బుకింగ్ చేద్దామనుకున్న వారికి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే అంటు యాప్‌లో కొత్త నిబంధనలు వచ్చే సరికి అన్నదాతలు ఆగం అవుతున్నారు. యాప్ బుకింగులో ప్రభుత్వం మార్పులు చేసినట్టు సమాచారం. దీనిప్రకారం.. 2 ఎకరాల రైతులు కేవలం 4 యూరియా బస్తాలు మాత్రమే బుక్ చేసుకోవాలి.

2 నుండి 5 ఎకరాల మధ్య రైతులు రెండు విడతల్లో.. 5 ఎకరాల పైన రైతులు మూడు విడతల్లో (40%, 30%, 30%) యూరియా బుక్ చేసుకోవాలని కండీషన్స్ పెట్టినట్టు సమాచారం. దీనికి తోడు ఒక్కో బుకింగ్‌కి మధ్య 20 రోజుల వ్యవధి తప్పనిసరిగా చేశారు.ఈ నిబంధనలపై రైతుల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/2074378974596415851?s=20

#uria app#uria bags#limitations#new changes#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి