పేరుకు మాత్రం సెలబ్రిటీలు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదు. కొన్నిసార్లు ఫేమస్ అవ్వడానికే వీళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని నెట్టింట చర్చ జరుగుతోంది. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త అశ్నీర్ గ్రోవర్ భార్య, భారత్ పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మాధురి జైన్.. పేదిరికంపై మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొందరు ఆమెకు మద్దతు ఇస్తుంటే మరికొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ షో 'లాక్ అప్ 2'లో కంటెస్టెంట్‌గా ఉన్న మాధురి.. ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే క్రమంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. తాము మూడో బిడ్డను కనాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. మూడో బిడ్డ మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుందని షారుఖ్ ఖాన్‌తో సహా ధనవంతులందరినీకీ మూడో బిడ్డ ఉన్నట్టు షో వ్యాఖ్యత అనగా..
'హమ్ దో హమారే దో' (మనం ఇద్దరం, మనకిద్దరు) అనే కాన్సెప్ట్ అందరికీ వర్తించదని, ధనవంతులు ఎక్కువ మంది పిల్లలను కంటే సంపద పెరుగుతుందని.. అదే పేదలు ఎక్కువ మంది పిల్లలను కంటే పేదరికం పెరుగుతుందని మాధురి కీలక వ్యాఖ్యలు చేశారు. సంపదతో పిల్లల సంఖ్యను ముడిపెడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా,పేదరికంలో ఉన్న వారు పిల్లల్ని కంటే వారిని ఎలా పెంచుతారు? మరల అప్పులు చేయాల్సి వస్తుంది?అప్పుడు వాటిని తీర్చే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.. ఫలితంగా పేదరికం ఎక్కువ అవుతుందని ఆమెకు మద్దతుగా కొందరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు ఉన్న వారికి పేదరికం విలువ తెలియదని, చులకన చేయడం మాత్రమే వచ్చని మరికొందరు విమర్శలు చేస్తున్నారు.












