వైరల్ న్యూస్

VIRAL: బండ్ల గణేశ్‌ కుమార్తె పెళ్లి పత్రికలో చంద్రబాబు దంపతుల పేర్లు

రచన: Desk 34 నిమిషాల పఠనం

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహ వేడుకల సందడి మొదలైంది.ఇందులో భాగంగా మొదటి శుభలేఖను తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకోగా, రెండో పత్రికను నారా భువనేశ్వరికి అందజేయడం విశేషం.

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహ వేడుకల సందడి మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఆగస్టు 16న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 11:58 గంటలకు ఈ పెళ్లి జరగనుంది. ఇప్పటికే నిశ్చితార్థాన్ని ఘనంగా ముగించిన బండ్ల గణేశ్.. ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల ప్రముఖులకు స్వయంగా ఆహ్వాన పత్రికలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి శుభలేఖను తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకోగా, రెండో పత్రికను నారా భువనేశ్వరికి అందజేయడం విశేషం.

అయితే, ఈ పెళ్లి పత్రికపై "శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో" అని ప్రత్యేకంగా ముద్రించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేశ్‌ పరమ భక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. పవన్‌ను ఎల్లప్పుడూ తన 'దేవుడు' అని సంబోధించే బండ్ల గణేశ్, తన కుమార్తె పెళ్లి కార్డుపై ఏపీ సీఎం చంద్రబాబు దంపతుల పేర్లను ప్రముఖంగా వేయించడంపై నెటిజన్లు, పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

మరోవైపు బండ్ల గణేశ్‌కు నారా కుటుంబంతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, అభిమానం కారణంగానే ఆ పేర్లను ముద్రించారని పలువురు గుర్తు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలై మళ్లీ సీఎం కావాలని మొక్కుకున్న బండ్ల గణేశ్.. ఆ కోరిక నెరవేరడంతో హైదరాబాద్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశారు. అదేవిధంగా నారా భువనేశ్వరి పుట్టినరోజున ఒక నిరుపేద బాలుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించి తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నారా దంపతులపై ఉన్న గౌరవంతో శుభలేఖపై వారి పేర్లను చేర్చారని, ప్రస్తుతం ఈ కార్డు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోందని విశ్లేషిస్తున్నారు.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి