Romanchakam Glimpse: ఇప్పటి వరకూ దర్శకుడిగా బాక్సాఫీస్ వద్ద సెన్షేషన్స్ క్రియేట్ చేసిన మ్యాడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, ఇప్పుడు రోమాంచకం సినిమాను నిర్మిస్తున్నాడు. తన సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ పతాకంపై తన సోదరుడు ప్రణయ్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజై ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక్క గ్లింప్స్ తోనే సినిమా గ్యారెంటీ హిట్ అనే టాక్ మొదలైంది.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి వంగ ఎలాంటి ఇంటెన్స్ ఉన్న కథలను ఆవిష్కరిస్తాడో అర్థమైంది. విజయ్ దేవరకొండకి రౌడీ హీరోగా స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చి పెట్టాడు. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్-కియారా అద్వాలనీలకి ఇదే సినిమా రీమేక్ కబీర్ సింగ్‌తో తెచ్చిపెట్టాడు. ఆ తర్వాత షాహిద్ కెరీర్‌లో అత్యంత పారితోషికం అందుకునే స్థాయికి తీసుకొచ్చాడు. కియారా కూడా చాలా బిజీ హీరోయిన్ అయిపోయింది.
ఇక, అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల వసూళ్ళను రాబట్టి..మరో సెన్షేషన్‌ని క్రియేట్ చేశాడు సందీప్. రష్మిక మందన్న, రణ్బీర్ కపూర్ లకి కెరీర్ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ సాధించిన సందీప్ రెడ్డి..ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను ఎంతో ఇంటెన్సిటీతో తెరకెక్కిస్తున్నాడు. జస్ట్ ఫస్ట్ లుక్ తోనే స్పిరిట్ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చూపించాడు. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ నటిస్తోంది. ఈ క్రమంలో నిర్మాతగా మారి రోమాంచకం చిత్రాన్ని చేస్తున్నాడు.
ఇందులో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటిస్తున్నారు. దర్శకుడిగా వేణు గోపాల్ రెడ్డి మెగా ఫోన్ పట్టాడు. తాజాగా వదిలిన గ్లింప్స్ ఎంతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, ఇది ఓ క్యూట్ లవ్ స్టోరీ అని గ్లింప్స్ చూస్తే క్లియర్‌గా అర్థమవుతోంది. మరి, సందీప్ రెడ్డి మార్క్ సినిమాగా ఉంటుందా లేక క్లాస్ టచ్‌తో రొమాంటిక్ సినిమాగా ఉంటుందా అనేది చూడాలి. ఇక, ఈ సినిమాను వినాయకచవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నారు.












