తెలంగాణ

Highcourt : ఒవైసీకి బిగ్‌రిలీఫ్.. ఫాతిమా కాలేజీని కూల్చొద్దు : హైకోర్టు

రచన: Desk 13 నిమిషాల పఠనం

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి బిగ్ రిలీఫ్ లభించింది. బండ్లగూడ పరిధిలోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ లిమిట్స్‌లో నిర్మించిన ఫాతిమా కాలేజీని కూల్చవద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి బిగ్ రిలీఫ్ లభించింది. బండ్లగూడ పరిధిలోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ లిమిట్స్‌లో నిర్మించిన ఫాతిమా కాలేజీని కూల్చవద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దానిమీద స్టేటస్ కో విధించింది. అంతకుముందు ఫాతిమా కాలేజీకి ఎలాంటి అనుమతులు లేవని అటు జీఎచ్ఎంసీ కోర్టుకు పేర్కొంది. అదేవిధంగా ఆ విద్యాసంస్థలకు విద్యాశాఖ నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేవని అధికారులు పేర్కొనడంతో హైకోర్టు ఈనెల 9న తుది తీర్పు వెల్లడిస్తానని పేర్కొంది.

ఈ క్రమంలోనే వివాదంలో ఉన్న తమ విద్యాసంస్థల భవనాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఒవైసీ విద్యాసంస్థల యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.అయితే, ఆ భవనం సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉందని, మరో ధర్మాసనం ఎదుట విచారణ జరుగుతుందని, ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. కాగా, భవనం క్రమబద్ధీకరణ కోసం బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం(బీఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్నట్టు న్యాయస్థానానికి పత్రాలు సమర్పించడంతో.. భవనంపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసి తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు పేర్కొంది. కాగా,వచ్చేనెల 3 వరకు ఎలాంటి కూల్చివేతలు ఉండబోమని తెలుస్తోంది.

#fatima college#highcourt#FTL limits#ghmc#owaisi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి