కాళేశ్వరంపై హడావుడి రాజకీయాలతో అబద్ధాలు నిజం అవుతాయా?
ఎత్తి పోస్తే ఎన్ని కోట్లు దండగ అయ్యాయో గుర్తుందా?
ఇప్పుడు ఎల్ నినోను క్యాచ్ చేసుకునేందుకు బీఆర్ఎస్ డ్రామా?
వర్షాభావం లేదని గుర్తించని కాంగ్రెస్ సర్కార్
అన్నదాత ఆశలపై కాళేశ్వరం కహానీలు చెబుతున్న పార్టీలు
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
స్వేచ్ఛ చైర్మన్,
9848070809
కాళేశ్వరం కట్టుడు.. కూలుడు కాదు.. ఇప్పుడేంటి?
కాంగ్రెస్ సర్కార్‌ని రోజుకో ఇష్యూతో బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ చేస్తోంది. మైండ్ గేమ్‌తో సోషల్ మీడియాలో ఆటాడుకుంటోంది. సోయి లేని కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి చెక్ పెట్టలేకపోతోంది. అప్పులపై చెప్పిన లెక్కలు, కాళేశ్వర నిర్మాణంలో చేసిన అనవసరపు ఖర్చుల(వేల కోట్లు)ను ప్రజల ముందు పెట్టలేకపోతోంది. రెండున్నరేళ్ల పాలనలో ఎన్ని నీళ్లు ఎత్తిపోశారో, గంగ పాలు అయిన నీటి శాతం ఎంతో, కరెంట్ బిల్లు, నిర్వహణ ఖర్చు ఏంటో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నా చెప్పలేకపోతుతోంది. కూలిందని ఒక్క మాటతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి వర్షాభావం పైన అనుభవం లేదు. ఎల్ నినోతో చంద్రబాబు కాలాన్ని చూస్తాం అంటూ సెటైర్ వేస్తున్న వారికి నీటి వాటా, కాళేశ్వరాన్ని ఎలా వాడుకోవాలో ముందే చెప్పలేకపోవడం విఫలమైన పాలనకు నిదర్శనం.
ఎత్తిపోస్తేనే ఇప్పుడు లాభం?
జూలైలో కూడా వర్షాలు లేకపోతే పంటలు పడవు. దానికి కాళేశ్వరంలో పంపు హౌజ్ వరకు లక్ష్మి బ్యారేజ్ కి సంబంధం లేకుండానే నీళ్లు ఉంటాయి. ఆ వాటర్ ని ఎత్తి పోస్తే మూడు బ్యారెజీలకు చెందిన లింకులు, లోయర్ మానేర్ కి ఆసరా కల్పించవచ్చు. దానితో తెలంగాణ రైతులు గోదావరి నీటి రుచి చూడొచ్చు. బీఆర్ఎస్ ఫైట్ చేస్తేనే నీళ్లు ఎత్తిపోశారనేలా సీన్ మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని నిల్వ చేయడం కుదరదనే సమాధానం చెబుతోంది. చుక్క నీటిని కూడా ఎత్తి పోయలేమని సమాధానం ఇస్తోంది.
భారీ ఖర్చు
కాళేశ్వరం ఎత్తిపోతల విధానం కావడం వల్ల నీటిని తోడేందుకు భారీగా కరెంట్ వాడాల్సి వస్తుంది. కాగ్ నివేదికల ప్రకారం కరెంట్, నిర్వహణ ఖర్చులు కలిపి ఎకరానికి సంవత్సరానికి దాదాపు రూ.40,000 నుండి రూ.46,000 వరకు ఖర్చవుతుంది. ఇంతటి ఖర్చును భరించి ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లి కేసీఆర్‌కు క్రెడిట్ ఇవ్వడం ఎందుకు అనే ఆలోచనలోనూ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అయితే, ఎల్ నినోను సాకుగా చూపుతూ కాంగ్రెస్ సర్కార్‌ను బద్నాం చేయాలని గులాబీ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో గొప్పలు చెప్పిన కాళేశ్వరం వల్ల నీరు పారింది తక్కువే అని, చుక్క నీరు ఎత్తిపోయకుండానే రికార్డ్ స్థాయిలో పంటలు పండిస్తున్నట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నా, అదంతా సాగుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనుకూలతలు అని గులాబీ వర్గాలు వివరిస్తున్నాయి.












