సామాన్యుడికి బీఆర్ఎస్ సర్కార్‌లో కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 200 శాతం ఎక్కువ టార్చర్?
భూ భారతి, రిజిస్ట్రేషన్ శాఖకి ఒకటే లిస్ట్
ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నిషేధిత లిస్టుపై సమీక్షిస్తారా?
ధరణికి భూ భారతికి తేడా ఏంటో చెప్తారా?
ఉమ్మడి ఏపీ పట్టా పాసు బుక్‌లు ఇచ్చినా, రిజిస్ట్రేషన్స్ కావని అధికారుల నుంచి సమాధానం?
మంత్రులు, వారి బంధువులు దోచుకోవడానికే పనికొస్తుందని ఆధారాలు
లొసుగులు ఉంటే ఆ సాప్ట్‌వేర్ కంపెనీ నిర్వాహకులపై చర్యలు ఏవి?
అన్నింట్లో కాంప్రమైజ్ అయినట్లు భూముల దోపిడీలోనూ భాగస్వామ్యం అయ్యారా?
పొంగులేటి భూ దాహం తీరే వరకు కమిటీల పేరుతో కాలయాపనేనా?
భూ దోపిడీకి, దందాలకు ఈ ప్రొహిబిటెడ్ లిస్టులే కారణం అవుతున్నాయా?
8 ఏండ్లుగా అనధికార భూ నిషేదిత జాబితాలో మంత్రుల దందా విలువ వేల కోట్లు?
సుప్రీంకోర్టు చెప్పినా వినకుండా వందల బిల్డింగులు ఎలా నిర్మిస్తున్నారో చెప్తారా?
మీ హైడ్రా ఉద్యోగులు అక్కడ ఎలా వసూలు చేస్తున్నారో తెలుసా?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ చైర్మన్
9848070809
పెనంలో నుంచి పొయ్యిలో పడ్డాం.. అయ్యా నా భూమి రిజిస్ట్రేషన్ చేయండి?
కాంగ్రెస్ సర్కార్‌పై వ్యతిరేకతలో ప్రధాన కారణం భూ వివాదాలు. పరిష్కరిస్తాం, దరణిని బొంద పెడుతాం అని చెప్పి దాని కంటే 100 రేట్లు ఎక్కువగా ప్రజలను టార్చర్ చేసే భూ భారతిని తీసుకొచ్చారని రాష్ట్రమంతా మాట్లాడుకుంటున్నారు. గ్రామీణ లే అవుట్స్ పేరుతో రిజిస్ట్రేషన్స్ ఆపి వేశారు. దానికి ఓ లెక్క ఉంది అనుకున్నారు. కానీ భూ భారతి, ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి లింక్ పెట్టిన ప్రొహిబిటెడ్ లిస్టులో దోచుకునేందుకు మాత్రమే పెట్టినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ హాట్ కేక్ భూముల్లో గత 20 సంవత్సరాలుగా ప్రోహిబిటెడ్ లిస్టులో చాలా భూములు ఉన్నాయి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, ఖానామెట్ లోని ప్రభుత్వ భూములు అలాంటివే. కానీ వాటిలోనూ నిర్మాణాలు చేస్తున్నారు. వందల కోట్ల బిజినెస్ ఎలాంటి అనుమతులు లేకుండా 6 అంతస్తుల వరకు కడుతున్నారు. వాటికి లేని ప్రొహిబిటెడ్ సామాన్య ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్స్‌కి, గ్రామాల్లో పట్టా పాస్ బుక్‌లు ఇచ్చిన భూములకు ఎందుకు ఉంటోంది. రిజిస్ట్రేషన్స్ ఎందుకు కావడం లేదో ఎవరూ సమాధానం చెప్పని పరిస్థితి. ఎవరిని కలిస్తే, ఇంత ఇచ్చుకుంటే పని అవుతుంది అని సమాధానం లేదా, ఎమ్మెల్యే సాబ్ చెబితే చేస్తారు అని ఎమ్మారో స్థాయి అధికారులే చెప్పుకుంటున్న పరిస్థితి వచ్చింది. నాయకులకు తెలియకుండా ఎమ్మార్వో కూడా రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితి. ఇక్కడ మంత్రికి, సీఎం రేవంత్ రెడ్డి అనుచర గనానికి తెలియకుండా ఏ ఒక్క భూమి రిజిస్ట్రేషన్ కావడం లేదు.
లక్షల మంది బాధితులు
బీఆర్ఎస్ ధరణి తెచ్చి జీవితాలు నాశనం చేశాయి అని ఆనాటి పీసీసీ, ఈనాటి ముఖ్యమంత్రికి గోడు వెల్లబోసుకున్నారు. ఆర్టీఐ వేసినా సమాచారం ఇవ్వలేదని మీరే చెప్పారు. మీరు సీఎం అయ్యాక ఎప్పుడు హైదరాబాద్ భూ దందాలపై నోరు విప్పలేదు. మాట కూడా మాట్లకుండా కోర్ సిటిలో మీ బ్రదర్స్ పేరుతో ఏ అధికారం లేకుండానే దోచుకుంటున్నారు. వాళ్ల గురించి ఎప్పుడైనా అడిగారా? ఇప్పుడు మా సొంత భూములు ఎందుకు ప్రొహిబిటెడ్‌లో పెట్టారు అని బాధితులు అడుగుతున్నారు. సీఎం గారూ దీనిపై సమాధానం ఉంటుందా?












