Nag 100: నాగార్జున నటిస్తున్న మైల్ స్టోన్ మూవీ కింగ్ 100. ఈ సినిమాలో ఒకప్పటి గ్లామర్ బ్యూటీ టబు నటిస్తుందని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ, మేకర్స్ ఇప్పటి వరకూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఫిల్మ్ సర్కిల్స్‌లో తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం కింగ్ నాగార్జున తో టబు స్క్రీన్ షేర్ చేసుకుందట. ఈ సినిమాను తమిళ యువ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తెలుగులో మొదటి సినిమానే సీనియర్ స్టార్ హీరో కావడం కార్తీక్ కి కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. తండ్రీ-కూతుళ్ళ కాంబోలో ఎమోషనల్ మూవీగా కార్తీక్ తీర్చి దిద్దుతున్నాడు. సుష్మిత భట్ కీలక పాత్రను పోషిస్తోంది. ఐశ్వర్య రాజేష్ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. అలాగే, నాగార్జున సరసన నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే లాంటి బ్లాక్ బస్టర్స్ మూవీస్ చేసిన టబు నెగిటివ్ రోల్ చేస్తుంది.
ఇప్పటికే, నాగ్-టబు కాంబినేషన్ సీన్స్‌ని దర్శకుడు కార్తీక్ పూర్తి చేశాడు. ఇప్పటి వరకూ చేసిన సినిమాలలో టబు నాగ్‌తో రొమాన్స్ చేసింది. ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య యాక్షన్స్ సీక్వెన్సెస్‌లో కనిపించబోతున్నారట. మరి, ఈ సీనియర్ జోడీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. కింగ్ 100 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగార్జున తన అన్నపూర్ణ బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు.
టబు ఆ మధ్య బాగా హిందీ సినిమాలలో అందాల ఆరబోత పాత్రలతో కాక రేపింది. తెలుగు సినిమాలలో మాత్రం కనిపించి చాలా కాలం అయింది. పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న స్లమ్ డాగ్ మూవీలో ఓ ముఖ్య పాత్రను పోషించింది. త్వరలో, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు పూరి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది.












