ప్రపంచం

ప్రపంచ వేదికపై భారత్‌కు మరో గౌరవం.. మోదీకి ఇండోనేషియా ఘన స్వాగతం!

రచన: Desk 23 నిమిషాల పఠనం

ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠ మరోసారి మెరిసింది. ప్రధాని నరేంద్రమోదీ ఇండోనేషియా పర్యటనకు చేరుకోగా... ఆయనకు అక్కడ అరుదైన గౌరవం లభించింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో సరికొత్త చరిత్ర సృష్టించారు! జకార్తా గగనతలంలో అడుగుపెట్టడమే ఆలస్యం... ఆ దేశ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ప్రధాని మోదీ విమానానికి ఎస్కార్ట్‌గా నిలిచి, ఆయనకు అత్యంత అరుదైన గౌరవాన్ని అందించాయి.

విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వయంగా ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఈ అద్భుత క్షణాలను మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ... ఇండోనేసియా అధ్యక్షుడు చూపిన ఆత్మీయత తనను ఎంతగానో కదిలించిందని పేర్కొన్నారు.

అన్ని రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడమే ఈ పర్యటన ముఖ్య లక్ష్యం. కాగా ఇండోనేసియా పర్యటన ముగిసిన వెంటనే... ప్రధాని మోదీ జులై 8న ఆస్ట్రేలియాలో అడుగుపెట్టనున్నారు. అక్కడ జులై 9న జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ కార్యక్రమం కోసం ప్రవాస భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆస్ట్రేలియాలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం, ప్రధాని మోదీ అక్కడి నుంచి నేరుగా న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్తారు. ఇక భారత్‌కు ప్రపంచ దేశాలు ఇస్తున్న గౌరవం... అంతర్జాతీయ వేదికపై భారత దౌత్య బలాన్ని మరోసారి స్పష్టంగా చాటిందని చెప్పవచ్చు..

#india#indonesian#PM Narendra Modi#Indonesia Fighter Jets#Prabowo Subianto
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి