సినిమా

Kajal Aggarwal: మండోదరిగా కనిపిస్తే సరిపోతుందా?

రచన: Desk 74 నిమిషాల పఠనం

Kajal Aggarwal: సీనియర్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ దాదాపుగా ఫేడవుట్ అయిందనే చెప్పాలి. ఆచార్య సినిమా వరకూ సౌత్‌లో కాజల్ కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే, పెళ్ళి తర్వాత ఈ నార్త్ బ్యూటీ సినిమాలకి దూరం అయింది. బిడ్డకి జన్మనిచ్చి బాగానే గ్యాప్ తీసుకుంది.

Kajal Aggarwal: సీనియర్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ దాదాపుగా ఫేడవుట్ అయిందనే చెప్పాలి. ఆచార్య సినిమా వరకూ సౌత్‌లో కాజల్ కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే, పెళ్ళి తర్వాత ఈ నార్త్ బ్యూటీ సినిమాలకి దూరం అయింది. బిడ్డకి జన్మనిచ్చి బాగానే గ్యాప్ తీసుకుంది. మళ్ళీ భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ, కాజల్ ఫిజికల్‌గా చాలా మారడంతో పెద్దగా ఆకట్టుకోలేదు.

భగవంత్ కేసరి తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయనుకున్న కాజల్‌కి నిరాశ తప్పలేదు. అయితే, తన సక్సెస్ ట్రాక్ రికార్డ్, హిట్ కాంబినేషన్ వల్ల అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. అలా వచ్చిన అవకాశమే హిందీలో రూపొందుతున్న రామాయణ. ఈ మూవీలో మండోదరి పాత్రలో కనిపించబోతోంది. దీనిపై, ఇటీవల కాజల్ ఓ విషయాన్ని బయటపెట్టింది. అది, తన అభిమానులకి కాస్త షాకిచ్చే విషయమే.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన కాజల్ అగర్వాల్ గ్రాఫ్.. ఒక్కసారిగా పడిపోవడంతో వచ్చిన అవకాశమే గొప్పదిగా భావిస్తోంది. అందుకే, రామాయణలో మేయిన్ హీరోయిన్ సాయి పల్లవి అయినా, చిన్న పాత్ర అయిన మండోదరి చేయడానికి ఒప్పుకుంది. ఇటీవల ఈ పాత్ర నిడివి గురించి మాట్లాడుతూ..కొన్ని పాత్రల నిడివి స్క్రీన్‌పై తక్కువగా ఉన్నప్పటికీ, ఆ పాత్ర మైల్ స్టోల్‌గా నిలిచిపోతుందని చెప్పుకొచ్చింది.

కొన్ని కథల్లో పాత్ర నిడివి చూకుకోకూడదని తెలిపింది. మండోదరి పాత్ర తన జీవితంలో ఓ అద్భుతమైన అనుభూతిగా నిలుస్తుందని వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో పాత్ర నిడివి తక్కువైనప్పటికీ, దానికి ప్రాధాన్యం ఉంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తాననే సంకేతాలను మేకర్స్‌కి పంపింది. ఏదేమైనా, కాజల్ తీసుకున్న నిర్ణయం మంచిదే అంటున్నారు సినీ ప్రముఖులు. కాగా, రామాయణ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. యష్ రావణ పాత్రలో కనిపించబోతున్నాడు.

#kajalaggarwal#ramayana#ranbeerkapoor#sayipallavi#mandodari#bollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి