తెలంగాణ

Floods: భద్రాద్రిలో పెరుగుతున్న గోదావరి ఉధృతి!

రచన: Desk 33 నిమిషాల పఠనం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

  • 10.4 అడుగులకు చేరిన నీటిమట్టం!

  • అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం

  • ముంపు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. గత కొన్ని గంటల్లోనే నది నీటిమట్టం ఏకంగా 2 అడుగుల మేర పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 10.4 అడుగులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఎగువ నుంచి వరద ఉధృతి ఇలాగే కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను, లంక గ్రామాల నివాసితులను అధికారులు అప్రమత్తం చేశారు.

వరద పరిస్థితిని పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు నది తీరానికి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. విపత్తు నిర్వహణ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాబోయే 24 గంటల్లో ఎగువ నుంచి వచ్చే వరద ఆధారంగా మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిపై అధికారులు సమీక్ష జరపనున్నారు.

#Bhadrachalam#GodavariFloods#BhadradriKothagudem#GodavariWaterLevel#TelanganaRains#Floods2026
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి