టాప్ న్యూస్

ఈ20 పెట్రోల్‌పై మహీంద్రా క్లారిటీ.. పాత కార్లు సేఫ్!

రచన: Desk 33 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో ఎన్నో అపోహలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా కీలక వివరణ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో ఎన్నో అపోహలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా కీలక వివరణ ఇచ్చింది. తమ పెట్రోల్ కార్లన్నింటిలోనూ ఈ20 ఇంధనాన్ని పూర్తి సురక్షితంగా వాడుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఓ కస్టమర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన మహీంద్రా.. ప్రస్తుత పెట్రోల్ ప్రమాణాలకు అనుగుణంగానే తమ ఇంజిన్లను రూపొందించామని, దీనివల్ల వాహనాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని భరోసా ఇచ్చింది.

2025 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా కొత్త మోడళ్లను ఈ20 ఇంధనానికి అనుకూలంగా ప్రత్యేక సాంకేతికతతో క్యాలిబ్రేట్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. దీనివల్ల కొత్త కార్లలో మెరుగైన పికప్ (యాక్సిలరేషన్), ఇంధన సామర్థ్యం లభిస్తాయని పేర్కొంది. అదే సమయంలో అంతకంటే ముందు తయారైన పాత వాహనాల్లోనూ ఈ ఇంధనాన్ని నిశ్చింతగా వాడుకోవచ్చని, అయితే డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులను బట్టి మైలేజ్ లేదా యాక్సిలరేషన్‌లో స్వల్ప మార్పులు మాత్రమే ఉండే అవకాశం ఉందని వివరించింది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో మహీంద్రానే కాకుండా టయోటా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హీరో మోటోకార్ప్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఈ20 పెట్రోల్‌కు మద్దతుగా నిలిచాయి. ఈ ఇంధనం వల్ల మైలేజ్ కాస్త తగ్గొచ్చనేది నిజమే అయినప్పటికీ, ఇంజిన్ల మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండదని అన్ని కంపెనీలు ఏకగ్రీవంగా స్పష్టం చేశాయి. ప్రభుత్వ వాదనకు ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖులు కూడా తోడవడంతో వాహనదారుల సందేహాలకు తెరపడినట్లయింది.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి