ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఆయన తమకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి తప్పారని బాధిత సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఆరోపిస్తున్నది. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు ముగిసిపోయినా తన కూతురి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను అరెస్ట్ చేయడానికి మాత్రం ఐదు రోజులుగా దాదాపు ఐదు వందల మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించారని పేర్కొన్నారు. కానీ తన కూతురి కేసులోని నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా తమ కళ్ల ముందే తిరుగుతున్నారని ఆరోపించారు. యూట్యూర్ ప్రశ్న రావణ్ మీద మీద పెట్టిన దాంట్లో 10 శాతం శ్రద్ధ పెట్టి ఉంటే తమ కుటుంబానికి న్యాయం జరిగేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారని సుగాలి ప్రీతి తల్లి పార్వతి నిలదీశారు.
పవన్‌ను న్యాయం చేయాలని కోరానని, ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించినందుకు జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులతో తనపై మాటల దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. వికలాంగురాలినైన తనను బాడీ షేమింగ్ చేస్తున్నారని, తన కులాన్ని దూషిస్తున్నారని అన్నారు. ‘రావణ్‌పై రాజద్రోహం కేసు పెట్టించి రిమాండ్‌కు పంపిస్తున్నారు కదా? ఈ రోజు మీరు ప్రశాంతంగా నిద్రపోండి పవన్. ప్రశ్నించండి అంటున్నారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నారు’ అని పార్వతి ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.












