రాజకీయాలు

PrakajRaJ : యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమేనా? వెరీగుడ్.. ప్రకాశ్ రాజ్ సంచలనం!

రచన: Desk 14 నిమిషాల పఠనం

నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి కూటమి సర్కార్ మీద తనదైన శైలిలో వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియో షేర్ చేసిన ఆయన..యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు.. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.

నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి కూటమి సర్కార్ మీద తనదైన శైలిలో వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియో షేర్ చేసిన ఆయన..యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు.. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ప్రశ్న రావణ్‌పై అత్యంత కఠినమైన ‘ఉపా’ (Unlawful Activities Prevention Act) చట్టాన్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పరోక్షంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వీడియోలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..

ఏపీ సర్కార్ ప్రశ్న రావణ్ మీద వరుసగా తప్పుడు కేసులు పెట్టిందని..విచారణలో భాగంగా ఆ 4 కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినప్పటికీ మరల కేసుల పేరుతో అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. అన్యాయంగా UAPA వాడి ఓ యూట్యూబర్‌ను రిమాండ్ పంపుతారా? అహా జస్ట్ ఆస్కింగ్! అంటూ ప్రశ్నించారు.

అంతటితో ఆగకుండా.. ‘యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా.. వెరీగుడ్’ అంటూ పరోక్షంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ మీద ప్రకాశ్‌రాజ్ విమర్శలు సంధించారు. ఇది ప్రశ్నించే గొంతులను నొక్కడానికి చేస్తున్న కుట్ర అని అందరికీ అర్థమైందన్నారు. ఇప్పటికే జనసైనికులు ప్రశ్న రావణ్ వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారని.. ఏఐ వీడియోలు, ఫోటోలతో ఫేక్ వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఎవిడెన్స్ కింద ప్రశ్న రావణ్ దగ్గర నుంచి తీసుకున్న ఫోన్ ప్రస్తుతం జనసైనికుల దగ్గర ఉందని.. అందులోని వ్యక్తిగత సమాచారాన్ని వక్రీకరిస్తూ దిగజారుతున్నారని.. ఇంకా దిగజారుతూనే ఉండండంటూ సెటైర్లు వేశారు. ‘ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారితో మీ ఆట మొదలైందని.. కానీ,ఈ ఆటకు ముగింపు ప్రజలే ఇస్తారు’ అంటూ యాక్టర్ ప్రకాశ్‌రాజ్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.దీనికి జనసైనికులు కూడా కామెంట్ల రూపంలో గట్టిగానే బదులిస్తున్నారు.

https://x.com/prakashraaj/status/2073980698919407704?s=20

#prakashraj#pawankalyan#Youtuber ravan#andrapradesh#UAPA Act
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి