సినిమా

Tollywood: భాగ్యశ్రీ తెలుగు స్పీచ్‌.. తిరుప‌తి షేక్‌..!

రచన: Desk 75 నిమిషాల పఠనం

Tollywood: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'లెనిన్' చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

Tollywood: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'లెనిన్' చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరాగా.. స్టేజ్‌పైకి వచ్చిన మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో తిరుపతిని ఊపేసింది.

సాధారణంగా ఉత్తరాది ముద్దుగుమ్మలు తెలుగు ఈవెంట్లలో ఇంగ్లీష్‌లోనే ఎక్కువగా మాట్లాడతారు. కానీ భాగ్యశ్రీ మాత్రం మైక్ అందుకోగానే అచ్చతెలుగులో "తిరుపతి.. ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా.. నచ్చిందా?" అంటూ ప్రేక్షకులపై ప్రశ్నల వర్షం కురిపించింది. దానికి అభిమానుల నుంచి థియేటర్లు బద్దలైపోయేలా భారీ రెస్పాన్స్ రావడంతో.. "ఓ.. అయితే అదరగొట్టేసింది అన్నమాట!" అంటూ మురిసిపోయి మాట్లాడిన తీరు అక్కడి జనాల్లో పూనకాలు తెప్పించింది. తను ఇంకా తెలుగు నేర్చుకుంటున్నానని చెబుతూ, స్థానిక ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో తను పోషించిన 'భారతి' అనే క్యారెక్టర్ గురించి భాగ్యశ్రీ ఎంతో ఉద్వేగానికి లోనైంది. ఆ పేరు వినగానే తనకు ఒక గొప్ప ప్రయాణం గుర్తొస్తుందని, తన సినీ కెరీర్‌లోనే ఈ పాత్ర అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని భావోద్వేగంతో వ్యాఖ్యానించింది. ఇంతటి నటనకు ప్రాధాన్యమున్న పాత్రను తనకిచ్చిన దర్శక-నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అనుష్క, నివేదా థామస్ ల తర్వాత పరభాషా నటి అయి ఉండి కూడా ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడటానికి భాగ్యశ్రీ ప్రయత్నించడం ఆమె పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.

ఇక సినిమా కోసం హీరో అఖిల్ అక్కినేని పడిన కష్టాన్ని భాగ్యశ్రీ ఈ వేదికపై కొనియాడింది. షూటింగ్ సమయంలో ఒక టీమ్‌లా వర్క్ చేయడానికి అఖిల్ తనకు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిదని గుర్తుచేసుకుంది. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునను.. "మన కింగ్" అంటూ ప్రేక్షకుల చప్పట్లు, ఈలల మధ్య భాగ్యశ్రీ వేదికపైకి ఆహ్వానించిన తీరు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మురళి కిషోర్ అబ్బూరు (నందు) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న భాగ్యశ్రీ క్యూట్ స్పీచ్ లెనిన్ సినిమాపై హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

#tollywood#cinema#trendingnews#leninmovie#akhilakkineni#bhagyasriborse
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి