అయోధ్య రామాలయంలో విరాళాల గోల్‌మాల్‌పై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల్ని దోచుకునేవారు అధికారంలో ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఓ దోపిడీదారుడు అతను చేసిన దోపిడీపై దర్యాప్తు చేసుకోవాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రామ్ రక్ష పేరుతో ఆదివారం ముంబయిలో జరిగిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యానించారు.
అయోధ్యపై విచారణ నిష్పాక్షికంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. హిందుత్వను దుర్వినియోగం చేస్తూ ఆలయాన్ని ఎవరైనా దోచుకుంటే హిందువులు క్షమించబోరన్నారు. రాముడు అందరివాడని చెబుతూ ‘బీజేపీ రహిత రాముడి’ కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హనుమాన్ స్తోత్రం, హనుమాన్ చాలీసా, రామరక్ష స్తోత్రాలను పఠించారు. ఇదిలాఉండగా, ఇన్నాళ్లకు అయినా థాకరేకు రాముడు గుర్తుకు రావడం సంతోషకరమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ దాదర్‌లో సైటైర్లు వేశారు. కాగా, అయోధ్య రామమందిరంలో జరిగిన విరాళాల గోల్‌మాల్‌లో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే నిందితులను అరెస్టు చేయడంతో పాటు డబ్బులు ఎలా దొంగిలించారనే కోణంలో విచారణ జరుగుతున్నట్టు సమాచారం.












