సినిమా

'నాగ అఖిల్..' అఖిల్ కొత్త పేరు వెనుక క్రేజీ సెంటిమెంట్!

రచన: Desk 33 నిమిషాల పఠనం

అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఓ వీరాభిమాని చేసిన ప్రతిపాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది

అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఓ వీరాభిమాని చేసిన ప్రతిపాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అఖిల్ పేరును 'నాగ అఖిల్'గా మార్చుకుంటే బాగుంటుందని సదరు అభిమాని వేదికపై సూచించాడు.

ఈ 'నాగ అఖిల్' అనే పేరు వెనుక అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఒక బలమైన సెంటిమెంట్‌ను ఆ అభిమాని వివరించాడు. 'నాగ' అనే పదం తాత నాగేశ్వరరావు, తండ్రి నాగార్జునల నుంచి.. అలాగే 'అఖిల్' లోని 'అ' అనే అక్షరం నానమ్మ అన్నపూర్ణమ్మ, తల్లి అమల పేర్ల నుంచి వచ్చిందని తెలిపాడు. ఇలా ఒకే పేరులో కుటుంబంలోని నలుగురు పెద్దల ఆశీస్సులు ఉంటాయని అతడు చెప్పిన వివరణ అందరినీ ఆకట్టుకుంది.

అక్కినేని వంశంలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యల లాగా 'నాగ' అనే సెంటిమెంట్ అఖిల్‌కు కూడా కలిసి వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ 'లెనిన్' సినిమా గనుక బ్లాక్‌బస్టర్ హిట్ అయితే, అఖిల్ తన పేరును 'నాగ అఖిల్'గా మార్చుకుంటే బాగుంటుందంటూ సోషల్ మీడియాలో ఈ అక్కినేని ఫ్యాన్ సెంటిమెంట్ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి సినిమా ఫలితం తర్వాత అఖిల్ పేరు మార్చుకుంటాడో లేదో చూడాలి మరి.

#Naga Akhil#Akhil Akkineni#Lenin Movie#Akkineni Sentiment#Tollywood News#Ayyagare Number One
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి