Tollywood: సూపర్ స్టార్ రజినీకాంత్ దెబ్బకి మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల రిలీజ్ డెస్ట్స్ తారుమారైనట్టుగా తెలుస్తోంది. దసరా బరిలో రావాల్సిన విశ్వంభర, ఫౌజీ సినిమాల విడుదల వాయిదాకి జైరల్ 2 కారణమా? దీని గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఏం మాట్లాడుకుంటున్నారు..అనేది వివరాల్లోకి వెళ్ళి చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా ఆషిక రంగనాథ్ కీలక పాత్రలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ విశ్వంభర. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, మేకర్స్ ఈ దసరా బరిలో విశ్వంభర సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ, జైలర్ 2 వస్తోన్న నేపథ్యంలో ఈ సినిమాను మరోసారి పోస్ట్‌పోన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
అంతేకాదు, ప్రభాస్ నటిస్తున్న ఫైజీ సినిమాను కూడా డిసెంబర్ కి వాయిదా వేయబోతున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేష్, త్రివిక్రం కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం కూడా అనుకున్న డేట్ కంటే ముందుగానే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి, రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మాత్రం గ్యారెంటీగా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా దెబ్బకి మన టాలీవుడ్ స్టార్స్ నటించిన సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.












