దేశంలో భారీ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు అయ్యింది.ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ప్రవేశ ద్వారమైన రామ్‌నగర్‌లోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు రైడ్స్ చేశారు. టూరిజం ముసుగులో నిర్వహిస్తున్న ఓ భారీ సెక్స్ రాకెట్, రేవ్ పార్టీపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా 52 మందిని అరెస్ట్ చేయగా, ఓ మైనర్ బాలికతో సహా 10 మంది మహిళలను అధికారులు రక్షించారు.
ఇతర రాష్ట్రాల నుంచి సుందరంగా ఉన్న అమ్మాయిలు, విదేశీ మహిళలను రిసార్టుకు రప్పించి వారితో వ్యభిచారం నడుపుతున్నట్టు విశ్వనీసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. సరిగ్గా అదే టైంలో అక్కడ లిక్కర్ పార్టీ జరుగడం,మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ విటులు వారీపై నోట్ల వర్షం కురిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో అభ్యంతరకర సామగ్రితో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. యూపీలోని మీరట్‌కు చెందిన పెస్టిసైడ్స్ వ్యాపారవేత్త ఉమేంద్ర కుమార్ ఈ సెక్స్ రాకెట్‌కు సూత్రధారిగా తేలింది.పార్టీకి అటెండ్ అయిన ప్రతి మహిళకు రూ.10 వేల చొప్పున రేటు ఫిక్స్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.నిందితులపై పోక్సో, సెక్స్ రాకెట్ కింద కేసులు బుక్ చేసినట్టు సమాచారం.












