మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు అనుకున్నంత పనిచేసింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కంగారు జట్టు ఫైనల్లో ఇంగ్లండ్ జట్టును చిత్తుచేసి వరల్డ్ కప్పును ముద్దాడింది. లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసిస్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధికంగా 7 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా రికార్డును సొంతం చేసుకుంది.
ఈ కప్ నెగ్గడానికి ముందు కూడా ఆస్ట్రేలియానే అత్యధిక సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా ఉండేది. తాజాగా మరోసారి విజయం సాధించడంతో తన రికార్డును మరోసారి పదిలం చేసుకుంది.ఫైనల్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. తక్కువ స్కోరుకే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును.. కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్, ఫ్రెయా కెంప్ కీలక ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నారు.
బ్రంట్ 53 బంతుల్లో 58 పరుగులు చేయగా.. కెంప్ 28 బంతుల్లో 44 రన్స్ చేసి గౌరవప్రదమైన స్కోర్ అందించారు. బ్యాటింగ్‌లో రాణించలేకపోయిన ఇంగ్లండ్ బౌలింగ్ లోనూ తేలిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమైంది. ఫలితంగా 151 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది. బెత్ మూనీ 49 బంతుల్లో 64 పరుగులు, లిచ్‌ఫీల్డ్ 35 బంతుల్లో 48 రన్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.












