సినిమా

NBK 112: లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన బాలయ్య-కొరటాల

రచన: Desk 73 నిమిషాల పఠనం

NBK 112: నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్‌బికే 112 ప్రాజెక్ట్ ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అఖండ, వీర సింహారెడ్డి, డాకు మహారాజ్, భగవంత్ కేసరి, అఖండ 2 చిత్రాలతో బాలయ్య వరుస విజయాలను అందుకున్నారు.

ఈ క్రమంలో ఆయన మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొచ్చాడు. వీరి కాంబినేషన్‌లో ఇంతకముందు వచ్చిన వీర సింహారెడ్డి మాస్ హిట్ గా నిలిచింది. దాంతో మరోసారి గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబోలో సినిమా అనగానే అందరిలో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాను వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ముందు ఓ చారిత్రక కథతో తీయాలనుకున్నారు.

కానీ, బడ్జెట్‌ సహా తదితర కారణాల వల్ల ఆ కథను పక్కన పెట్టి మరో కొత్త కథతో రూపొందిస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని చిత్ర బృందం కూడా ముందే తెలిపింది. ఈ మూవీలో నయనతార జంటగా నటించనుంది. బాలయ్య, నయన్‌ కలిసి గతంలో శ్రీరామరాజ్యం, సింహా, జైసింహా చిత్రాల్లో నటించి హ్యాట్రిక్‌ అందుకున్నారు. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఈ సినిమాకి ఓ పవర్ ఫుల్ టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

ఈ క్రమంలోనే బాలయ్య తన 112వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. అంతేకాదు, ఓ లాంగ్ షెడ్యూల్ ని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశాడు. 20 రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్‌లో బాలయ్యపై హెవీ యాక్షన్ సీన్స్‌ని కంప్లీట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో, దీనికి సంబంధించిన అప్‌డేట్ రానుందట.

#nbk112#balakrishna#koratalasiva#latestupdates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి