సినిమా

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న 'రావు బహదూర్'.. సత్యదేవ్ కామెంట్స్ వైరల్

రచన: Desk 33 నిమిషాల పఠనం

వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వచ్చిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. జూలై 3న విడుదలైన ఈ ప్రయోగాత్మక చిత్రం మొదటి రోజు నుంచే అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వచ్చిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. జూలై 3న విడుదలైన ఈ ప్రయోగాత్మక చిత్రం మొదటి రోజు నుంచే అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలిరోజే రూ.3.11 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా 'సక్సెస్ మీట్'లో సత్యదేవ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సత్యదేవ్ మాట్లాడుతూ.. “సహజీవనం నాకు కొత్త కాదు” అని అనడంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. అయితే ఆయన వెంటనే ఆ మాటకు వివరణ ఇస్తూ.. అది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ఒక నటుడిగా తాను చేసే ప్రతి పాత్రతో మానసికంగా పూర్తిగా లీనమైపోతానని, ఆ క్యారెక్టర్ తనలోనే ప్రయాణిస్తుందని చెప్పారు. అందుకే ప్రతి పాత్రతో తాను సహజీవనం చేస్తానని ఆయన వివరించడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త తరహా కథనాన్ని అందిస్తోందని విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో సత్యదేవ్ పోషించిన 'భువనరామప్ప రావు బహదూర్' పాత్ర ఆయన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైనదిగా నిలిచింది. 1968 నుండి 1991 వరకు సాగే ఈ కథలో.. విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. భువనరామప్ప పాత్రలో ఆయన లీనమైన విధానానికి ప్రేక్షకులు థియేటర్లలో బ్రహ్మరథం పడుతున్నారు.

#RaoBahadur#Satyadev#VenkateshMaha#RaoBahadurSuccessMeet#TeluguCinema#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి