స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Phoenix Real Estate Scams Lax of trees

రచన: Swechaanews Chaiman5 నిమిషాల పఠనం

800 ఎకరాల ప్రభుత్వ భూమిలో 33 లక్షల టన్నుల కలపను అక్రమంగా తరలించారని ఫారెస్ట్ అధికారులు 10 కేసులు నమోదు చేశారు. ఫినిక్స్ బినామి సంస్థలు కొనుగోలు చేశామనే ముసుగులో పకృతిని నాశనం చేస్తున్నారు. ఈ విధ్వంసాని ఫినిక్స్ గోపి కృష్ణయే కారణం.

ఫినిక్స్ గోపి

కృష్ణావతారం?

- మారిన వేష భాషలు?

- కూకట్ పల్లిలో పకృతికే నామాలు?

- ఫారెస్ట్ భూముల్లో అడ్డగోలుగా చెట్ల నరికివేత?

- 33 లక్షల టన్నుల కలప అమ్మకానికి కారకుడు?

- 10 కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్న ఫారెస్ట్ అధికారులు?

- సెంట్రల్ యూనివర్సీటీలో హంగామా చేసిన వారంతా ఏమయ్యారు?

- ఇక్కడ అన్ని పార్టీలను మేనేజ్ చేస్తే ఏం కనిపించవా?

- నగరం నడిబొడ్డున జరిగిన పకృతి విధ్వంసంపై

స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

ఎవిడెన్స్‌తో కూడిన కథనం

9848070809

పకృతిపై కపట ప్రేమలు

పకృతి చాలా గొప్పది. ఎన్నో సార్లు ఇది రుజువైంది. ఏదైనా కీడు చేస్తే అది మనల్నే నాశనం చేస్తుంది. హైదరాబాద్ ని కాపాడేందుకు 111 జీవోని సుప్రీంకోర్టు కఠిన నిర్ణయాలతో తీర్పులు ఇచ్చింది. కానీ రాజకీయ పార్టీలు అనుకుంటే ఏ యాక్ట్స్ పనికి రావు అని చెప్పడానికి కూకట్ పల్లిలోని ఐడీఎల్ భూముల అమ్మకాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది. 800 ఎకరాల్లో చెట్లు, పుట్టలు, పక్షులు, వివిధ జీవరాశులు జీవిస్తున్నాయి. 1961 వరకు ఫారెస్ట్ ల్యాండ్ గా గుర్తించగా, 1962 మే 5న జీఓ నెంబర్ 715తో ఫ్యాక్టరీ కోసం 200 ఎకరాలు డీ నోటిఫై చేశారు. అప్పటికే ఆ భూముల్లో గిరిజనులు 130 ఎకరాలు, హరిజనులు 35 ఎకరాలు దున్నుకుంటున్నారు. అలా దున్నుకున్న వారికే భూమిలా ఎకరం వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకోండి అంటూ ఆనాటి ప్రభుత్వం జీవోలతో సహా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన భూమి 500 ఎకరాలు వివిధ పేర్లతో ఆనాటికి ఉదాసీన్ మఠ్ కి ఇచ్చిన భూములు, అన్నింటినీ కలిపి కూకట్ పల్లిలో 800 ఎకరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సేల్ సర్టిఫికేట్ తో ధారదత్తం చేసింది. 50 ఏండ్ల చెట్లను ఎవరి అనుమతి లేకుండా నరికేస్తూ వందల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. 2023 నుంచి 2026 వరకు రియల్ మాఫియా చేస్తున్న విధ్వంసం గూగుల్ ఎర్త్ లో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. వీటన్నింటి చూశాక పకృతి ప్రేమికులు ఎక్కడకి పోయారు? ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆనాటి రెవెన్యూ మినిస్టర్ గా కేసీఆర్ ఉన్నందుకా? ఇప్పుటి సీఎంకి వాటాలు ముట్టినందుకా? అనే ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పార్ట్ 4లో మరిన్ని సంచలనాలు

కళ్ల ముందు పకృతిని నాశనం చేసిన పునాదుల్లో హిందుజా కంపెనీ, ఫినిక్స్ బినామీలు, సైబర్ సిటీలాంటి ప్రత్యక్ష నేరస్థులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందిని నిందితులుగా చేర్చి కటకటాలకు నెట్టాలి. వాళ్లు కొన్న రేట్ ఎంత? చేసుకున్న దందా ఎంత? ఇప్పటికి పేపర్స్ పై చెప్పుకుంటున్న చెక్స్ అన్నీ క్లైమ్ అయ్యాయా? వారికి ఎలా ఆ సొమ్ము వచ్చింది? ఇలా అన్ని ఆధారాలతో పార్ట్ 4గా మీ ముందుకు వస్తాను. మీ స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

#కూకట్ పల్లి ఐడీఎల్ భూముల కుంభకోణం#ఫినిక్స్ గోపి బినామి దందా#దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఇన్వెస్టిగేషన్#హైదరాబాద్ ఫారెస్ట ల్యాండ్ స్కామ్#Lands Kukatpally#Devender Reddy Chinthakuntla#Phoenix Gopi Cybercity#Hinduja Scam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

ఫోటోలు

తర్వాత చదవండి