వైరల్ న్యూస్

VIRAL : ఊరేగింపులో పెళ్లికూతురు డ్యాన్స్.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి!

రచన: Desk 13 నిమిషాల పఠనం

ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో వింత విషయాలు వెలుగుచూస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొందరు విడాకుల వరకు వెళ్తున్నారు. మరికొన్ని పెళ్లి పీటల మీదే ఆగిపోతున్నాయి. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో వింత విషయాలు వెలుగుచూస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొందరు విడాకుల వరకు వెళ్తున్నారు. మరికొన్ని పెళ్లి పీటల మీదే ఆగిపోతున్నాయి. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

తాజాగా మరో వింత ఘటన ఏపీలో చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేయడానికి పెళ్లి కూతురు రెడీ అవ్వడంతో పక్కనే ఉన్న వరుడు ఆమె మీద సీరియస్ అయ్యాడు. ‘నువ్వు డ్యాన్స్ చేయడం నాకు ఇష్టం లేదని గద్దిరించాడు’. దీంతో వధువు తండ్రికి పెళ్లికొడుకు యవ్వారం అసలే నచ్చేలేదు. పెళ్లికి ముందే తన కూతురుతో ఇలా ప్రవర్తిస్తే పెళ్లయ్యాక ఇంకెలా ఉంటాడో అని ఏకంగా పెళ్లి తంతునే రద్దు చేశాడు. ఈ ఘటన ఏపీలోని మార్కాపురం జిల్లా కంభం మండలం తురుమెళ్ళ గ్రామంలో వెలుగుచూసింది.

తురుమెళ్లకు చెందిన యువతితో రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడుతో వివాహం నిశ్చయం చేసిన వధువు తండ్రి.. పెళ్ళికి ముందు రోజు రాత్రి వరుడి గ్రామంలో ఊరేగింపు తీస్తున్న సమయంలో వధువువరులను డాన్స్ చేయాలని బంధువులు, మిత్రులు కోరారు. డాన్స్ చేసేందుకు వధువు సిద్ధమైన సమయంలో వరుడు సీరియస్ అవ్వడమే ఆయన కోంపముంచింది. దీంతో పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోవడంతో అంతా షాక్ అయ్యారు.

#Marriage#cancel#bride#rude behaviour#andrapradesh#viralnews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి