క్రైమ్

Breaking : జర్నలిస్టు కేవీఆర్ భార్య ఫిర్యాదు.. సీఐపై బదిలీ వేటు

రచన: Desk 12 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లో నాలుగురోజుల కిందట ఏపీ పోలీసులు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. రాత్రి సమయంలో జర్నలిస్టు కేవీఆర్ ఇంటికి వెళ్లి ఆయన్ను బలవంతంగా ఏపీకి తీసుకెళ్లారు.

హైదరాబాద్‌లో నాలుగురోజుల కిందట ఏపీ పోలీసులు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. రాత్రి సమయంలో జర్నలిస్టు కేవీఆర్ ఇంటికి వెళ్లి ఆయన్ను బలవంతంగా ఏపీకి తీసుకెళ్లారు.ఏపీ ప్రభుత్వంపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారనే నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం. అయితే, కేవీఆర్ అరెస్టు సమయంలో కేవీఆర్ భార్యతో అనుచితంగా ప్రవర్తించిన సీఐపై బదిలీ వేటు పడింది.

జర్నలిస్టు కేవీఆర్ భార్య ఫిర్యాదుతో హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే ఆయన్ను విశాఖ ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు రోజుల క్రితం తెలంగాణ జర్నలిస్టు KVRను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి బొబ్బిలికి తీసుకొచ్చిన సీఐ శ్రీనివాస్..ఇదే కేసులో గతంలో KVRను అరెస్ట్ చేయడంలో విఫలమైన బాడంగి ఎస్ఐను కూడా అధికారులు వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే.

#bobbili CI srinivas#transfered#kvr wife complaint#hyderabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి