ఫిపా వరల్డ్ కప్-2026లో సాకర్ అభిమానులకు ఊహించని షాకులు తగులుతున్నాయి. తమ అభిమాన జట్లు కప్ కొడతాయా? అని అంతా ఎదురుచూస్తున్న సమయంలో దిగ్గజ ఆటగాళ్లు ఫుల్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతున్నారు. బ్రెజిల్ దిగ్గజ ఆటగాడు నెయ్‌మర్ ఇప్పటికే జాతీయ జట్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించగా.. తాజాగా మరో సాకర్ వరల్డ్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగల్) ఇదే తన చివరి వరల్డ్ కప్ అని ప్రకటించారు. తన కెరీర్‌లో ఆరోసారి ప్రపంచకప్ ఆడుతున్న రొనాల్డో.. ఎలాగైనా ఈసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్బంగా రొనాల్డో మాట్లాడుతూ..‘ఇదే నా చివరి వరల్డ్ కప్.. స్పెయిన్‌తో మ్యాచ్ చివరిది కాకూడదని అనుకుంటున్నా. ఏదో ఒక రోజు ఆటకు వీడ్కోలు పలకాల్సిందే.కానీ, ఆటను ఎంతవరకు ఆస్వాదించామనేదే ముఖ్యం.అందులో నేను నిజాయతీగా ఉంటా.రేపు ఏం జరిగినా ప్రశాంతంగా అక్కడి నుంచి నిష్క్రమిస్తా. ఫుట్‌బాల్ కోసం నాకు చేతనైనంత వరకూ చేశా. ఆటపట్ల ప్యాషన్‌తోనే కొనసాగుతున్నా.
ప్రతి రోజునూ ఆస్వాదిస్తున్నా’ అని రొనాల్డో వెల్లడించాడు. కాగా మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్ జట్లతో కలిసి 6 సార్లు చాంపియన్స్ లీగ్ గెలిచిన రొనాల్డో.. పోర్చుగల్ తరపున 2016లో యూరో కప్ కూడా సాధించాడు. రొనాల్డో రికార్డుల కెరీర్‌లో లేని ఏకైక కప్ ‘వరల్డ్ కప్’ మాత్రమే.ఈసారైనా రొనాల్డో తన కలను నెరవేర్చుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది.












