సినిమా

Tollywood: ` రావు బహదూర్` మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రు..?

రచన: Desk 74 నిమిషాల పఠనం

Tollywood: బాక్సాఫీస్ దగ్గర ఒక్కోసారి కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా.. అనుకోకుండా మరో హీరో చేతికి వెళ్లడం, అది కాస్తా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేయడం టాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. సరిగ్గా ఇలాంటి మ్యాజిక్కే తాజాగా విడుదలై, విమర్శకుల ప్ర‌శంస‌లు అందుకుంటున్న ‘రావు బహదూర్’ సినిమా విషయంలోనూ జరిగింది.

Tollywood: బాక్సాఫీస్ దగ్గర ఒక్కోసారి కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా.. అనుకోకుండా మరో హీరో చేతికి వెళ్లడం, అది కాస్తా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేయడం టాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. సరిగ్గా ఇలాంటి మ్యాజిక్కే తాజాగా విడుదలై, విమర్శకుల ప్ర‌శంస‌లు అందుకుంటున్న ‘రావు బహదూర్’ సినిమా విషయంలోనూ జరిగింది. సత్యదేవ్ నటనకు, దర్శకుడు వెంకటేష్ మహా టేకింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ క్లాసిక్ హిట్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ ఉంది. ఈ కథను మొదట ఒక స్టార్ యాంగ్రీ హీరో చేయాల్సింది, కానీ సీన్ రివర్స్ అయింది.

నిజానికి దర్శకుడు వెంకటేష్ మహా ఈ వైవిధ్యమైన కథను సత్యదేవ్ కంటే ముందే టాలీవుడ్‌లో చాలా మంది హీరోలకు వినిపించారు. ఈ క్రమంలోనే సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్‌కు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ దాదాపు ఓకే అయిపోయింది. అంతేకాదు, ఈ సినిమాకు అప్పట్లో ‘మ‌ర్మాణువు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కూడా అనుకున్నారు. అంతా సెట్ అయిపోయి, సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్న తరుణంలో.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది.

అలా రాజశేఖర్ హ్యాండ్స్ నుండి చేతులు మారిన ఈ కథ.. చివరకు టాలెంటెడ్ హీరో సత్యదేవ్ చెంతకు చేరింది. ఎప్పుడైతే కథ సత్యదేవ్ చేతికి వచ్చిందో, అప్పటి నుంచే సినిమా జాతకం మారిపోయింది. కమర్షియల్ హంగులకు దూరంగా, ప్యూర్ సినిమాగా తెరకెక్కిన ఈ ప్రయోగాత్మక చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రమోషన్ల స్ట్రాటజీ వల్ల నాన్-థియేట్రికల్ రైట్స్ పరంగానూ నిర్మాతలకు సేఫ్ జోన్ తెచ్చిపెట్టింది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ తర్వాత సత్యదేవ్ - వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వచ్చిన ఈ రెండో సినిమా.. టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబోగా ముద్ర వేసేసుకుంది.

ఇప్పుడు థియేటర్లలో రావు బహదూర్ చూశాక‌.. "ఈ పాత్రకు సత్యదేవ్ కాకుండా ఇంకెవరు చేసినా ఇంత అప్లాజ్ వచ్చేది కాదు" అని ప్రేక్ష‌కులు చెప్తున్నారు. ఒకవేళ రాజశేఖర్ ఈ సినిమా చేసి ఉంటే బాగుండేదేమో కానీ, సత్యదేవ్ తెచ్చినంత నేచురాలిటీ, మ్యాజిక్ రావడం కష్టమే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా, ఒకరు వదులుకున్న ప్రాజెక్ట్ మరొకరికి కెరీర్ బెస్ట్ మైలురాయిగా మారడం అంటే ఇదేనేమో.

#RaoBahadur#VenkateshMaha#Satyadev#Dr.rajasekhar#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి