సినిమా

Akhil: లెనిన్ కోసం డ్రాగన్..క్రేజీ అప్‌డేట్‌తో ఊగిపోతున్న ఫ్యాన్స్!

రచన: Desk 73 నిమిషాల పఠనం

Akhil: లెనిన్ కోసం డ్రాగన్..క్రేజీ అప్‌డేట్‌తో ఊగిపోతున్న ఫ్యాన్స్! అవును ప్రస్తుతం కొన్ని పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ సోషల్ మీడియా మొత్తం షేకవుతోంది. ఆ పిక్స్ అక్కినేని వారసుడు అఖిల్, నందమూరి వారసుడు తారకరామారావులది. వీరిద్దరూ ఎందుకోసం కలిశారు..ఏం చేయబోతున్నారు అనే విషయాలను ఫుల్ స్టోరీలో తెలుసుకుందాం..

అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన సినిమా లెనిన్. డివోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాను మురళి కిషోర్ అబ్బూరి తెరకెక్కించాడు. నాజూకు సుందరి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జూలై 10వ తేదీన ఎంతో గ్రాండ్‌గా సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తిరుపతిలో జరిగిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడమే కాదు..సినిమాపై భారీ హైప్‌ను కూడా తీసుకొచ్చింది.

నాగార్జున, అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ, నిర్మాత నాగవంశీ స్పీచ్ సినిమా రేంజ్‌ను ఇంకా పెంచాయి. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఏజెంట్ తర్వాత అఖిల్ సాలీడ్ హిట్ కొట్టాలనే.. డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నారు. మొత్తం చిత్రబృందం హిట్ కొడుతున్నామనే ధీమాతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా, తారక్ ఈ మూవీకి వాయిస్ ఓవర్‌ను అందివ్వడం హైలెట్ అయింది.

వాయిస్ ఓవర్ మాత్రమే కాకుండా కథను కూడా నరేట్ చేస్తూ తారక్ హైప్ ఇస్తాడని క్లారిటీ వచ్చింది. తాజాగా, దీనికి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి, అఖిల్ ఎంతో శ్రమించి చేసిన లెనిన్ ఎలాంటి విజయాన్ని ఇస్తుందో అని అక్కినేని అభిమానులే కాకుండా సినీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకి జూలై 10న సమాధానం దొరకబోతుంది.

#akhil#lenin#bhagyasriboarse#nagarjuna#ntr
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి