సినిమా

Hero Nani: ఆ దర్శకులిద్దరికీ గ్రీన్ సిగ్నల్?

రచన: Desk 73 నిమిషాల పఠనం

Hero Nani: నేచురల్ స్టార్ నాని అటు హీరోగా ఇటు నిర్మాతగా చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే, అవుట్ పుట్ విషయంలో అటు నాని ఇటు శ్రీకాంత్ అసలు కాంప్రమైజ్ కావడం లేదు. అందుకే, ఈ సినిమా కాస్త ఆలస్యమవుతోంది.

ఈ గ్యాప్ లో నాని తన నెక్స్ట్ సినిమాల లైనప్‌ను సెట్ చేసుకుంటున్నాడు. ‘ది ప్యారడైజ్’ తర్వాత ఓజీ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ సినిమాను చేయబోతున్నాడు. ఓజీ 2 తర్వాత ఇది పట్టాలెక్కనుంది. అలాగే, నానితో సినిమా చేయడానికి వెంకీ అట్లూరి చర్చలు జరుపుతున్నాడు. ‘లక్కీ భాస్కర్’ మూవీతో వెంకీ సాలీడ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి కోలీవుడ్ హీరో సూర్యతో ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రాన్ని చేస్తున్నాడు. దీని తర్వాత నాని-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమాను ప్రకటించనున్నారట.

ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కోర్ట్ సినిమాతో నిర్మాతగా సూపర్ హిట్ అందుకున్న నాని, మెగాస్టార్ చిరంజీవి తో ఓ భారీ బడ్జెట్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ లైనప్‌లోనే హిట్ మూవీ సీక్వెల్ కూడా ఉంది. ఇందులో, తమిళ హీరో కార్తి నటిస్తున్నాడు.

#heronani#venkeyatluri#sujith#chiranjeevi#srikanth odela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి