Epic Movie: బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న రొమాంటిక్ సీన్స్, ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో పాటు క్లైమాక్స్ ఎంతో ఎమోషనల్‌గా సాగడంతో అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ బేబీ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు.
ఇప్పుడు ఇదే జంట ఎపిక్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గ్లింస్ అండ్ టీజర్ వచ్చినప్పటి నుంచి అభిమానులే కాదు, సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇన్నిరోజులు ‘ఎపిక్’ మూవీ విడుదలపై ఒక క్లారిటీ రాలేదు. కానీ, తాజా సమాచారం మేరకు ఓ క్రేజీ అప్‌డేట్ ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. యూత్ లవ్ స్టోరీ అయినప్పటికీ ఎపిక్ సినిమాను భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తైన ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. దాదాపు, ఈ వర్క్ తుది దశకి చేరుకుందట. ఒక క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఎపిక్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతుందని చిత్ర బృందం చాలా ధీమాను వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ నెలాఖరున డేట్ లాక్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ నుంచే ట్రేడ్ వర్గాల్లో అలాగే ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. మరి, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లిద్దరికి సరైన సక్సెస్ దక్కలేదు. ఇప్పుడు వీరిద్దరు ఎపిక్స్ సక్సెస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.












