పార్లమెంట్ సమావేశాల వేళ దేశరాజధాని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన ‘చలో సంసద్’ పిలుపు కాస్త తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. నిన్న మొదలైన ఆందోళనలు నేడు కూడా కొనసాగుతున్నాయి. నిన్న కేంద్రఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో సీజీపీ ప్రతినిధులు సమావేశం అయ్యి తమ ప్రధాన మూడు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. అయితే,డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం నుంచి ఇంకా క్లారిటీ రాకపోవడంతో మంగళవారం ఉదయం సీజేపీ, విద్యార్థులు మరోసారి పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించారు.
నీట్ పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే బాధ్యులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణ కూడా జరుగుతోంది. అయితే, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేయడం.. ఆయన రిజైన్ చేయకపోవడంతో పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు.మరోవైపు సోనమ్ వాంగ్ చుక్ కూడా తన నిరహార దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయాలని సోనమ్ ఆస్పత్రి నుంచే పిలుపునివ్వడంతో అది కాస్త తీవ్రఉద్రిక్తతకు దారితీసింది.
ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. నిరసనలు తెలుపుతున్న వారికి మద్దతు తెలిపారు. పోలీసుల లాఠీచార్జ్, నీట్ పేపర్ లీకేజీ సంక్షోభంపై పార్లమెంట్‌లో వెంటనే సమగ్ర చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ఇండియా కూటమికి చెందిన ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతిపత్రం అందించారు. తమ భవిష్యత్ కోసం న్యాయమైన ప్రశ్నలు అడిగిన విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం దారుణమని, విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ బాధ్యతారాహిత్యంపై చట్ట సభల్లో చర్చ జరగాల్సిందేనని రాహుల్ స్పష్టంచేశారు.
భారతీయ యువత భవిష్యత్ గురించి చర్చించని పార్లమెంట్ ఉండి కూడా దండగేనని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టడాన్ని ప్రతిపక్షాలు ఎంతమాత్రం ఒప్పుకోవని తేల్చిచెప్పారు.నిరసన తెలుపుతున్న విద్యార్థుల గొంతుక వీధుల్లోనే కాకుండా పార్లమెంట్ వేదికగా కూడా ప్రతిధ్వనించేలా ప్రతిపక్షాలు పోరాడుతాయన్నారు. వారికి పూర్తి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదే లేదని రాహుల్ స్పీకర్‌కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు.












