వైరల్ న్యూస్

India: నెట్ లేకున్నా డిజిటల్ పేమెంట్.. త్వరలో కొత్త టెక్నాలజీ!..

రచన: Venu4 నిమిషాల పఠనం

భారత్‌లో డిజిటల్ చెల్లింపులు రోజు రోజుకు సులభతరం అవుతున్నాయి. కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ వల్ల ఊహించని విధంగా మార్పులు తెస్తున్నాయి. ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే..ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా.. చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది..

భారత్‌లో డిజిటల్ చెల్లింపులు రోజు రోజుకు సులభతరం అవుతున్నాయి. కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ వల్ల ఊహించని విధంగా మార్పులు తెస్తున్నాయి. ఇదే దిశగా మరో కీలక అడుగు పడుతోంది. ఇంటర్నెట్ లేకపోయినా త్వరలో UPI ద్వారా షాపుల్లో పేమెంట్స్ చేసే సౌకర్యాన్ని తీసుకురావడానికి NPCI సిద్ధమవుతోంది.

ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. మొబైల్ ఫోన్‌కు లేదా వ్యాపారి వద్ద ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా.. రూ.2 వేల వరకు చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. దీంతో నెట్‌వర్క్ సమస్యలున్న ప్రాంతాల్లోనూ డిజిటల్ పేమెంట్లు మరింత సులభం కానున్నాయి.

ఈ వ్యవస్థ NFC టెక్నాలజీతో పనిచేస్తుంది. ముందుగా ఇంటర్నెట్ ఉన్నప్పుడు UPI Lite వాలెట్‌లో డబ్బులు లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెట్ లేకపోయినా.. NFC సపోర్ట్ ఉన్న మొబైల్‌ను PoS మెషీన్‌కు ట్యాప్ చేస్తే చెల్లింపు పూర్తవుతుంది. అంతేకాదు.. UPI PIN కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఇక నెట్‌వర్క్ లేని చోట్ల కూడా డిజిటల్ పేమెంట్లు సులభం కానున్నాయి. PoS టెర్మినల్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాకపోయినా.. చెల్లింపు వివరాలను సురక్షితంగా భద్రపరుస్తుంది. నెట్‌వర్క్ తిరిగి వచ్చిన వెంటనే ఆ వివరాలను NPCI సిస్టమ్‌కు పంపి ధృవీకరణ పూర్తి చేస్తుంది. దీంతో విమానాలు, మెట్రో అండర్‌గ్రౌండ్ స్టేషన్లు, నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో సైతం పేమెంట్లు చేయవచ్చు.

ఇక UPI Lite Xను NPCI 2023లో పరిచయం చేసింది. కాగా ఈ టెక్నాలజీ ప్రధానంగా NFC ఫోన్ల మధ్య లేదా ప్రత్యేక NFC QR కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌ల ద్వారా ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం రూపొందించబడింది. అయితే ఈ పేమెంట్ల మిషన్ కోసం NPCI నుంచి ప్రత్యేక సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులకు ఒక్కో లావాదేవీపై రూ.500 పరిమితిని నిర్ణయించింది.

ఇక UPI Liteలో గరిష్టంగా వెయ్యి రూపాయల వరకు చెల్లింపులు చేయొచ్చు. అయితే కొత్త ఆఫ్‌లైన్ UPI వ్యవస్థలో ఒక్కో లావాదేవీకి రెండు వేల రూపాయల వరకు అనుమతించే ప్రతిపాదన ఉంది. దీనిపై NPCI త్వరలో పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు చేసే సౌకర్యం అందుబాటులోకి వస్తే.. డిజిటల్ పేమెంట్స్‌లో ఇది మరో కీలక ముందడుగు కానుంది!

#india#launch offline#upi-payments#without internet#New technology
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి