తెలంగాణ

BJP : నీట్‌పై చర్చకు సిద్ధం.. అయోధ్యతో మాకేం సంబంధం? : ఎంపీ రఘనందన్ రావు

రచన: Kumar3 నిమిషాల పఠనం

పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు, నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య విరాళాల చోరీపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తాజాగా స్పందించారు.

పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు, నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య విరాళాల చోరీపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తాజాగా స్పందించారు. రూల్స్ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని, విపక్షాల ఆలోచనకు అనుగుణంగా జరగవని రఘునందన్ రావు స్పష్టంచేశారు. జంతర్ మంతర్‍లో జరుగుతున్న ధర్నాలకు ఫోటోల కోసమే వెళ్లి విపక్ష సభ్యులు ఆందోళనలు చేసి సభను వాయిదా వేయిస్తున్నాయని ఆరోపించారు.

ఇవాళ మీడియాతో ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. నీట్, ప్రజా సమస్యలపై చర్చకు కేంద్రం సిద్ధంగానే ఉందన్నారు. నీట్ పేపర్ లీక్ బాధాకరమని, దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. నీట్‍పై చర్చలో భాగంగా సమగ్ర సమాధానం చెబుతామన్నారు. గతంలో జరిగిన పేపర్ లీక్‍లపై ఎవరైనా రాజీనామా చేశారా? అని ఎంపీ ప్రశ్నించారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్‌‌ను కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని.. ఫలితాలు కూడా వెలువడ్డాయన్నారు.

పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న టైంలో ‘చలో సంసద్’ ముట్టడికి పిలుపునిస్తే ఏ ప్రభుత్వమైనా నిరసనకారులను రానిస్తుందా? ప్రశ్నించారు. ఆందోళనకారులను పార్లమెంట్ వరకు రానివ్వకుండా ఆపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.నీట్ అంశంపై చర్చించడానికి స్పీకర్ అంగీకరించినా ఇప్పుడే చర్చ జరగాలని, జీరో అవర్ రద్దు చేసి చర్చపెట్టాలని ప్రతిపక్షాలు అడగడం ఏంటని ఫైర్ అయ్యారు. ఇకపోతే అయోధ్య విరాళాల చోరీతో బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. దీనిపై యూపీ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసిందని, సమగ్రంగా విచారణ జరుగుతోందన్నారు. గుడిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి దురాశతో చేసిన పనికి దానిని బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు ఆపాదించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

#Mp Raghunandan rao#NEET#Ayodya Donation Case#Politics#BJP
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి