National

CJP: టెన్షన్ టెన్షన్... మరోసారి పార్లమెంట్ ముట్టడికి సీజేపీ యత్నం!

రచన: Kumar3 నిమిషాల పఠనం

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొన్నంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోజ్ జనతా పార్టీ ఫాలోవర్స్ మరోసారి ఆందోళనకు దిగారు.

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొన్నంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోజ్ జనతా పార్టీ ఫాలోవర్స్ మరోసారి ఆందోళనకు దిగారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తూనే పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. నిన్న సీజేపీ ఇచ్చిన ‘చలో పార్లమంట్ పిలుపు’ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు.

పోలీసులు, భద్రతా బలగాలు మూడెంచెల వలయం ఏర్పాటు చేసి మరి నిరసనకారులను కట్టడిచేస్తున్నారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం మరోసారి పార్లమెంట్ ముట్టడికీ సేజీపీ ప్రయత్నించగా.. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న పోలీసులు లాఠీచార్జిలో గాయపడిన యువతను సీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్దకు తీసుకువచ్చారు. వారిని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే పరామర్శించారు. అయితే, నిన్న ఉద్రిక్తతల వేళ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అవన్నీ పట్టించుకోకుండా యువత పెద్దఎత్తున పార్లమెంటుకు వెళ్లే దారులను బ్లాక్ చేసింది. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుంటే సీజేపీ నిరసనలు కేంద్రానికి తలనొప్పిగా మారాయి. మరోవైపు సామాజికవేత్త సోనమ్ వాంగ్ చుక్ తన ఉపవాస విరమణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.నిన్నఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తప్పుపడుతూ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాము విధించిన మూడు షరతులను కేంద్రం వెంటనే నెరవేర్చాలని లేదంటే దీక్ష కొనసాగించాలని వాంగుచుక్ స్పష్టంచేశారు.

#CJP Protests#Delhi#parliment march#Students#abhijith deepke#sonam wangchuk
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి