తెలంగాణ

Harish Rao : రైతులకు నీళ్లు ఇవ్వాలన్న జ్ఞానం మంత్రులకు లేదా? : హరీశ్ రావు

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికార పార్టీ కావాలనే రైతులకు నీటి ఇబ్బందులు సృష్టిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.

రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికార పార్టీ కావాలనే రైతులకు నీటి ఇబ్బందులు సృష్టిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఓవైపు వర్షాలు రావడం లేదని, ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా సాగు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. కాళేశ్వరం వద్ద నీళ్లు వృథాగా కిందకు వెళ్తున్నాయని ఎంత చెప్పిన రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర పోతుందని విమర్శించారు.

ఇక మంత్రి సీతక్క నియోజకవర్గంలో రైతులు సాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతు సమస్యలపై ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు పక్కనే ఉన్న రామప్ప డ్యాం గేట్లు ఎందుకు మూసేశారని ప్రశ్నించారు. రామప్పలో నీళ్ళు ఉన్నా గేట్లు మూసేయడంతో, డ్యాం కింద పొలాలు ఎండిపోయాయని.. రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న జ్ఞానం మంత్రులకు ఉండాలి కదా? అని విమర్శించారు.

https://x.com/TeluguScribe/status/2079462299564126453?s=20

అలాగే.. దేవాదుల, సమ్మక్క బ్యారేజీ నుంచి జూన్ 1 నుండి ఇవాళ్టి వరకు 105 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ వైపు వదిలారని, కానీ ఈ 51 రోజుల్లో రేవంత్ సర్కార్ ఎత్తింది మాత్రం 1.9 టీఎంసీల నీళ్లు మాత్రమే అని చెప్పారు. 12 టీఎంసీల నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా కూడా ఎత్తిపోయలేదని పేర్కొన్నారు. 12 టీఎంసీల నీళ్లు ఎత్తే అవకాశం ఉంటే 2 టీఎంసీలు కూడా ఎత్తలేదని.. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ‘నీ భాషలో చెప్పాలంటే నిన్ను ఇప్పుడు ఉరి తీయాలి’ కదా.. అని హరీశ్ రావు మండిపడ్డారు.

#minister seetakkaa#harish rao#water issues#irrigation problems#kaleshwaram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి