సినిమా

NBK111: బాల‌య్య‌కు యాక్సిడెంట్.. హాస్పిట‌ల్‌లో అడ్మిట్‌..!

రచన: Anshu3 నిమిషాల పఠనం

NBK111: నందమూరి అభిమానులకు, సినీ ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా పాల్గొంటున్న సినిమా చిత్రీకరణలో ప్రమాదానికి గురయ్యారు. కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సెట్‌లో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా ఈ అనుకోని ఘటన చోటుచేసుకుంది.

దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం కొన్ని ప్రమాదకరమైన సీన్స్ షూట్ చేస్తున్నారు. మంచు మనోజ్ కూడా ఉన్న ఈ రిస్కీ ఫైట్ సీక్వెన్స్ సమయంలో బాలకృష్ణ అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి కాలుజారి కిందపడ్డారు. దీంతో ఆయన మోకాలి భాగంలో దెబ్బతగిలి గాయపడటంతో సెట్‌లో ఉన్న చిత్ర బృందం ఒక్కసారిగా ఆందోళనకు గురైంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేసి, బాలయ్యను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రాథమిక చికిత్స అందించారు. గాయం తీవ్రమైనది కాదని, స్వల్పంగానే తగిలిందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మోకాలికి విశ్రాంతి అత్యవసరమని డాక్టర్లు తెలపడంతో ఆయనను కొద్దిరోజుల పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.

ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాలయ్య త్వరగా కోలుకోవాలని వేలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా ఉందని, చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

#nbk111#balakrishna#gopichandmalineni#nbk
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి