ఏపీ

రేపే ఖాతాల్లోకి రూ.13వేలు.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు

రచన: NK4 నిమిషాల పఠనం

ఏపీలోని కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అందులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే తల్లికి వందనం. పేద విద్యార్థుల తల్లులకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్ కు సంబంధించి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి (జూలై 22) నుంచి తల్లికి వందనం పథకం డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. జూలై 22 నుంచి జూలై 24వ తేదీ వరకు 3 రోజుల పాటు దశలవారీగా నిధుల విడుదల ప్రక్రియ కొనసాగనుంది.

Thalliki Vandanam: ఏపీలోని కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అందులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే తల్లికి వందనం. పేద విద్యార్థుల తల్లులకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్ కు సంబంధించి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి (జూలై 22) నుంచి తల్లికి వందనం పథకం డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. జూలై 22 నుంచి జూలై 24వ తేదీ వరకు 3 రోజుల పాటు దశలవారీగా నిధుల విడుదల ప్రక్రియ కొనసాగనుంది.

1వ తరగతి నుండి ఇంటర్ చదివే విద్యార్థులకు లబ్ది

ఈ పథకం కింద ప్రభుత్వం రూ.15 వేలు సాయం ప్రకటించగా అందులో స్కూళ్ల నిర్వహణ కోసం రూ.2 వేలు మినహాయించింది. మిగతా 13 వేల రూపాయలు విద్యార్థి తల్లి ఖాతాలో నేరుగా జమ చేయనుంది. ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.

నకిలీ లింకులతో తస్మాత్ జాగ్రత్త

తల్లికి వందనం పథకం డబ్బులను ప్రభుత్వం రిలీజ్ చేయనున్న ఈ తరుణంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు ప్లాన్ చేస్తున్నారని సైబర్ పోలీసులు హెచ్చరించారు. నకిలీ లింకులతో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టేందుకు రెడీ అయ్యారని చెప్పారు. నకిలీ లింకుల పట్ల లబ్ధిదారులు చాలా కేర్ ఫుల్ గా ఉండాలన్నారు. “మీ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి” లేదా ”వెంటనే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోండి” అంటూ ఫోన్లకు వచ్చే ఫేక్ లింకులు, మేసేజ్ లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సూచించారు. పొరపాటున అటువంటి లింకులపై క్లిక్ చేస్తే మీ ఫోన్‌లోకి సైబర్ నేరగాళ్లు చొరబడే అవకాశముందన్నారు. ఇక, మీ బ్యాంకు అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బు సైబర్ నేరగాళ్లు దోచుకునే రిస్క్ ఉందన్నారు. ఇక, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంక్ ఖాతా సంఖ్య, ఏటీఎం పిన్, ఆధార్ నెంబర్, ఓటీపీ వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని తేల్చి చెప్పారు.

ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలకు గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులపైనా క్లిక్ చేయకూడదన్నారు. అసలు ప్రభుత్వం అలాంటి మేసేజ్ లు కానీ లింకులు కానీ పంపదని స్పష్టం చేశారు. తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే మీ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాన్ని లేదా స్కూల్ హెడ్ మాస్టర్ ని కలిసి నివృత్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

#Thalliki Vandanam#Thalliki Vandanam Scheme#Funds#Andhra Pradesh#AP Govt#Talliki Vandanam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి