స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

పంచాయతీల జనరల్ ఫండ్ ఎక్కడయ్యా?

రచన: Swechaanews Chairman••6 నిమిషాల పఠనం

తెలంగాణలో కొత్త సర్పంచ్ ల ఆర్ధిక బాధలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో పనులు చేసి అప్పులయినందుకు అత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న సొంత గ్రామ సొత్తు(జనరల్ ఫండ్)ను వాడుకునేందుకు వీలు లేకపోవడంతో చిన్న చిన్న పనులకోసం సర్పంచ్ లు తమ జేబులోంచి ఇవ్వాల్సి వస్తుంది.

  • ఎస్టీఓలో రేండేళ్లుగా పాస్ కాని చెక్కులు

  • ఉద్దెర ఇచ్చేందుకు వెనకడుగు ?

  • సొంతంగా పెట్టుకుంటూ అప్పుల పాలవుతున్న సర్పంచులు

  • సీఎం చెప్పినట్లు సొంత అదాయానికి ప్రత్యేక అకౌంట్ తీస్తే..? ఈ పాత సొమ్ము సంగతెంటీ అంటూ అనుమానాలు ?

  • ఒక్కొక్క గ్రామ జనరల్ ఫండ్ లక్ష నుంచి కోటి వరకు అక్కడే ?

  • 500 కోట్లకు పైగా ఆర్బీఐ అనుమతి అంటూ మూలుగుతున్న

  • గ్రామ పంచాయతీల సొంత సొత్తు బాధలపై స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్,

9848070809

సర్పంచ్ లకు పెరుగుతున్న ఆర్ధిక ఒత్తిళ్లు

తెలంగాణలో కొత్త సర్పంచ్ ల ఆర్ధిక బాధలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో పనులు చేసి అప్పులయినందుకు అత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న సొంత గ్రామ సొత్తు(జనరల్ ఫండ్)ను వాడుకునేందుకు వీలు లేకపోవడంతో చిన్న చిన్న పనులకోసం సర్పంచ్ లు తమ జేబులోంచి ఇవ్వాల్సి వస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి ప్రత్యేక అకౌంట్స్ తీసి నేరుగా జమచేసుకుని, ఖర్చు చేసుకునేలా పంచాయితీ రాజ్ యాక్ట్ 2018 లో సెక్షన్ 70 (3) ని సవరిస్తామని హామి ఇచ్చారు. కాని రెండు నెలలు అయినా ఇంకా అచరణ నోచుకోలేదు. పైగా గత 2 ఏండ్లుగా గ్రామ జనరల్ ఫండ్ సుమారు 500 కోట్లు ట్రెజరీలో మూలుగుతున్నాయి. పంచాయితీ ఇవ్వాల్సిన ఖర్చులకు చెక్స్ ఇస్తే ఇప్పటికి రిలీజ్ చేయని పరిస్థితి ఉంది. 2 ఏండ్ల క్రితం ఇస్తేనే ఇంకా మీ డబ్బులు రాలేదు. ఇప్పుడు ఇస్తే ఎప్పుడు వస్తాయో అంటూ మొఖం చాటేస్తున్నారు. ఉద్దెర లేదని కరాఖండిగా తేల్చి మొహం మీదే చెప్పేస్తున్నారు. దీంతో బ్లిషింగ్ పౌడర్ కి ట్రాక్టర్లకు ఏలాంటి రిపెయిర్స్ వచ్చినా, డీజిల్ కోసం సొంతంగా పెట్టుకుంటూ ఆర్ధిక భారం మోస్తున్నారు.

కొత్త విధానంతో పాత డబ్బులు వస్తాయా ?

చట్టంలో మార్పులకు వెంటనే గెజిట్ విడుదల చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని సర్పంచులు వేడుకుంటున్నారు. ఆలస్యం చేస్తే గ్రామ కనీస సౌకర్యాల మెయింటెనెన్స్ కుంటుపడుతుందని వాపోతున్నారు. అలాగే రెండేళ్ల ఇంటి పన్ను, నల్లా పన్ను, ఇతర పన్నుల రూపంలో వచ్చిన అదాయం మొత్తం జనరల్ ఫండ్ కింద ఎస్టీవోలో జమ చేశాము. ఆ సొమ్ము తిరిగి వినియోగించుకునేలా ఉంటుందా ? లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంతకు ముందే చెక్స్ ఇష్యూ చేయడంతో వాటిని క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ డబ్బులు వస్తే మళ్లీ కొత్త చెక్స్ ఇష్యూ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పుతున్నారు. తెలంగాణలో మొత్తం 12,760 గ్రామ పంచాయితీల్లో రూ. లక్ష నుంచి కోటి వరకు డిపాజిట్ చేసి ఉంచారు. సగటున 4 లక్షలు చొప్పున అయినా ఉంటుంది. రూ.500కోట్లు రిలీజ్ చేస్తే గ్రామాలను మరింత సుందరంగా తీర్చదిద్దడంతో పాటు ఇతరాత్రా పనులు త్వరగతిన చేయొచ్చని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు.

మా గ్రామ సొంత ఫండ్ 28 లక్షలు 9 లక్షలకు చెక్స్ ఇచ్చాం

రెండేళ్లుగా మా మేజర్ గ్రామ పంచాయతీ నుంచి ప్రభుత్వ ఖజానాకు 28 లక్షలు పన్నుల రూపంలో జమ చేశాం. వివిధ పనులు చేయించుకున్నందుకు రూ.9లక్షలు వాళ్ల అకౌంట్స్ కి జమ చేయాలని చెక్స్ ఇచ్చాం. ట్రెజరరీ నుంచి ఆర్బీఐ అనుమతులు అంటూ క్లియర్ చేయలేదు. దీంతో పంచాయతీ అవసరాల కోసం ఏ షాపులో అడిగినా ఇవ్వడం లేదు. మీకు ఇస్తే ఎప్పుడు వస్తాయో అంటూ ముఖం మీదనే చెప్పుతున్నారు. వాళ్లు చెప్పిన సమాధానం మనం ప్రజలకు చెప్పలేము. వాళ్లకు మనమే జవాబుదారి కాబట్టి పనులు సొంత ఖర్చులతో చేయాల్సి వస్తుంది. మా పక్కనే ఉన్న ముల్కానూర్ గ్రామ జనరల్ ఫండ్ రూ.97లక్షలు ఉంది. వాళ్లకు కూడా ఇదే పరిస్థితి ఉంది. సినిమాలో కోట శ్రీనివాస్ రావు కోడి దూలాని వేలాడదీసి ఒట్టి అన్నం తిన్నట్లుగానే మా పరిస్థితి ఉంది. ఫండ్స్ రిలీజ్ అయితే గ్రామాలను మరింత ముందుకు తీసుకెళ్తాం.

– పబ్బు సతీష్, కమలాపూర్ సర్పంచ్

#Panchayat Funds#Telangana Panchayats#Sarpanch Financial Issues#Treasury Funds#General Fund#Rural Development
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి