Mahesh-Sandeep Reddy: సందీప్ రెడ్డి వంగ..ఈ పేరుకి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా మంచి క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి సినిమాకి ముందు, ఆ తర్వాత ఈ దర్శకుడు కథ చెప్పిన హీరోలంతా షాకయ్యారు. ఇలాంటి కథలను ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా? అని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలున్నారు. వారిలో, మన తెలుగు స్టార్స్ కూడా ఉన్నారు. కానీ, తెలుగులో, అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో అందరి మనసు మారిపోయింది.
అర్జున్ రెడ్డి సినిమాలో అన్నీ ఎమోషన్స్ ఉన్నాయి. ఫాదర్ సెంటిమెంట్-ప్రేమ అంశాలను చాలా బలంగా చూపించాడు. రొమాన్స్ చూపించినా కూడా, అది అందరికీ నచ్చే విధంగా సినిమా తీయడం ఈ మధ్య కాలంలో ఒక్క సందీప్ రెడ్డి వంగ వల్ల మాత్రమే అయిందనుకోవచ్చు. అనిమల్ సినిమాలోనూ అంతే. తండ్రీకొడుకుల మధ్య బాండింగ్, బలమైన ఎమోషన్స్ సినిమాకి ప్రధాన బలంగా మారాయి.
ఒక, కథను ఇలా కూడా చెప్పొచ్చా? అనే ఆలోచన స్టార్ హీరోలు, దర్శకులకి కూడా అనిపించింది. భార్య ఉన్నా, వేరొక అమ్మాయితో బెడ్రూంలో ఇంటిమేట్ సీన్స్ తీసి దానికి బలమైన కారణం చూపించి అందరినీ ఒప్పించింది సందీప్ రెడ్డి వంగ. అనిమల్ సినిమా ప్రమోషన్స్ రాజమౌళి, రాంగోపాల్ వర్మ, మహేష్ బాబు, ప్రభాస్ సహా పలువురు స్టార్స్ అభినందించారు.

ఇప్పుడు, ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రాన్ని చేస్తున్న సందీప్..దీని, తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'డెవిల్' అనే సినిమాను చేస్తాడని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. మహేష్ వారణాసి పూర్తి చేసి, సందీప్ స్పిరిట్ పూర్తి చేసి ఆ తర్వాత వీరిద్దరు 'డెవిల్' సినిమా కోసం కలవబోతున్నట్టుగా సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి షేర్ చేసిన వీడియోతో ఓ క్లారిటీ వచ్చింది. మహేష్ బర్త్ డే సందర్భంగా సందీప్ షేర్ చేసిన ఈ వీడియోతో వీరి ఫ్యాచర్ ప్రాజెక్ట్‌ని కన్‌ఫర్మ్ చేసినట్టుగా భావిస్తున్నారు. ఇక ఈ వీడియో ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. గతంలో మహేష్ బాబు చేసిన ఒక కమర్షియల్ యాడ్ కి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం కూడా వహించాడు.












