సినిమా

Meenakshi Chaudhary: చిరు పాత్రలో చిన్న రోల్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. మిగతా హీరోయిన్స్‌లా వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకోకుండా మంచి కథ, అందులో తన పాత్ర నిడివి-ప్రధాన్యత ఉంటేనే ఒప్పుకుంటోంది. గత చిత్రం అనగనగా ఒకరాజు మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. మీనాక్షి అంతకముందు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ అందుకుంది.

ఇలా, మంచి చిత్రాలనే ఎంచుకుంటోంది. ఇప్పుడు, అక్కినేని నాగ చైతన్య సరసన వృష కర్మ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తండేల్ లాంటి భారీ హిట్ తర్వాత చైతూ నటిస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. ఇది, కూడా మీనూకి మంచి సక్సెస్‌ని ఇస్తుందని చాలా నమ్మకంగా ఉంది. ఇక, సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ కూడా ఉన్నట్టు అనిల్ రావిపూడి హింట్ ఇచ్చాడు. ఇందులో, కూడా మీనూ ఉండే అవకాశాలున్నాయి.

చిరు సినిమాలో మీనాక్షి?

ప్రస్తుతం, మెగాస్టార్ చిరంజీవి-బాబి కొల్లి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. కీలక పాత్రలో అనస్వర రాజన్ నటిస్తోంది. ఇప్పటికే, శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే, తాజా సమాచారం మేరకు చిరు నటిస్తున్న ఈ మెగా 158లో మీనాక్షికి ఓ గెస్ట్ రోల్ చేసే అవకాశం వచ్చిందట. కథలో, మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలుస్తోంది.

బాబీ చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన వారికి కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో కేథరీన్ రవితేజ భార్యగా నటించింది. ఈ పాత్రకి బాగానే పేరొచ్చింది. ఇప్పుడు, చిరు సినిమాలో మీనూ రోల్ కూడా ఇలా, ఇంపార్టెంట్ ఉన్నదే అని సమాచారం. ఇదే, నిజమైతే మరో సీనియర్ సినిమాలో నటించే ఛాన్స్ మీనాక్షి అందుకున్నట్టే, మరి దీనికి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా, మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా నుంచి అప్‌డేట్ రానుంది.

#MeenakshiChaudhary#MegastarChiranjeevi#Mega158#BobbyKolli
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి