Slum Dog 33 Temple Road: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ సినిమాలతో మన తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ దేశాలకి చూపించిన రాజమౌళి లాంటి వారు ఎందరున్నా..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లాంటి వారు మాత్రం ఉండరు. ఇది, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అందుకే, బాహుబలి రైటర్, డైరెక్టర్ కూడా ఆయనకి అభిమానులే. అలాంటి, పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న లేటెస్ట్ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. టబు పాత్రను పరిచయం చేయనున్నారు.
గత కొంతకాలంగా ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాధ్ లేటెస్ట్‌గా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాంగ్ 33 టెంపుల్ రోడ్ అనే వెరైటీ టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తైన ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను ప్రస్తుతం జరుపుకుంటోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల, ఫైనాషియర్స్ కి పాత బకాయిలు క్లియరెన్స్ కాక, ఆలస్యం అవుతోంది.
ఈ నేపథ్యంలో కొంత నెగిటివిటీ కూడా సినిమాపై జరుగుతోంది. కానీ, పూరి స్టామినా ఏంటో తెలియని వాళ్ళు చేస్తున్న పని. ఇలాంటివెన్నో చూశారాయన. హిట్స్, ఫ్లాప్స్ కొత్తేమీ కాదు. ఇక, కోట్లలో పోగొట్టుకున్నోడికి ఫ్లాప్ ఒక లెక్కా. కాబట్టి, ఆయన అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ..ట్రైలర్ కోసం..ఫైనల్‌గా సినిమా రిలీజ్ కోసం. ఈ నేపథ్యంలో, ఈ సినిమాలో గౌరీ హెగ్డే పాత్రలో నటించిన టబును రివీల్ చేయబోతున్నారు. దీనికి, సంబందించిన అప్‌డేట్ ఇస్తూ.."ఆమెతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు".. అనే ట్యాగ్ ని షేర్ చేశారు. దీనితో అందరిలోనూ ఓ ఆసక్తి రేగింది.












