సినిమా

Mamitha Baiju: అల్లు అర్జున్ కి డైహార్ట్ ఫ్యాన్..ఒక్కో సినిమా పదిసార్లు చూస్తా

రచన: Anshu3 నిమిషాల పఠనం

Mamitha Baiju: మన సినీ తారలకి అభిమానులుండటం సహజమే. మన సౌత్ సినిమా ఇండస్ట్రీలన్నీ ఫ్యాన్స్ బేస్డ్ ఇండస్ట్రీలే. ఇక్కడ ఒక్కో హీరోకి కోట్లలో అభిమానులున్నారు. వాళ్ళు చేసే హడావిడి ముందు ఇంకేది పనికిరాదు. అయితే, సినీ తారలకే సినీ తారలు అభిమానులుగా మారడం ఎంతో ఆసక్తికరమైన విషయం. ఒక దర్శకుడు ఇంకో దర్శకుడికి ఫ్యాన్.

ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరోకి ఫ్యాన్. సుజీత్, థమన్ పవన్ కళ్యాణ్ అంటే చచ్చిపోతారు. దాని ఫలితే ఓజీ సక్సెస్. ఇక, మన స్టార్ హీరోలకి హీరోయిన్స్ చాలామంది అభిమానులుగా మారుతున్నారు. చిరంజీవికి నాటి తరం నుంచి నేటి తరం కథానాయికలందరూ ఫ్యాన్స్ అని చాలా సందర్భాలలో చాలామంది చెప్పారు. నాగార్జునకి మన హీరోయిన్స్ చాలామంది ఫ్యాన్స్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌లకి మన స్టార్ హీరోయిన్స్‌లో చాలామంది అభిమానులున్నారు. ఇప్పుడు, ఆ లిస్ట్ లో మమిత బైజు కూడా చేరింది. తనకి, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఎంతటి అభిమానమో మాటల్లో చెప్పలేనంటోంది. ఆయనలా డ్రసింగ్ అవడం..స్లీవ్ లెస్ టీ షర్ట్ పై షర్ట్ వేసుకుంటే అలా, మమిత కూడా డ్రస్ వేసుకొని అబ్బాయిలా తిరిగేదట.

ఇక, అల్లు అర్జున్ ప్రతీ సినిమాను పదేసి సార్లు చూస్తుందట. ఇండస్ట్రీకొచ్చిన అతికొద్ది కాలంలోనే మంచి క్రేజీ హీరోయిన్‌గా మారిన మమిత బైజు తాజాగా సూర్య సరసన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బన్నీపై తనకున్న గాఢమైన అభిమాన్ని తెలియజేసింది మమిత. ప్రేమలు, డ్యూడ్ సినిమాతో బాగా పాపులర్ అయింది. సౌత్ లో ఇప్పుడు మమిత ఫుల్ ఫాంలో ఉంది.

#mamitha baiju#alluarjun#vishanathandson#surya#allufans
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి