Priyanka Chopra: నేడు (ఆగస్టు 9) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆయనకి ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ ని తెలిపింది. దీనితో పాటు వీరిద్దరు కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి మూవీ ఆన్‌సెట్స్ పిక్ ని కూడా షేర్ చేసింది. ఇది, సెల్ఫీ కావడం ఆసక్తికరం. ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ జరిపిన సమయంలో తీసుకున్న పిక్ ఇది.
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా వారణాసి. శ్రీదుర్గ ఆర్ట్స్ పిక్చర్స్, ఎస్.ఎస్.కార్తికేయ కలిసి ఈ సినిమాను 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు-ప్రియాంక చోప్రా-పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే, వచ్చిన గ్లింప్స్ ద్వారా పలు కాలాలో తిరిగే కథాంశం అని అర్థమైంది. ఇటీవల రాజమౌళి కూడా కథ ఎక్కడ మొదలవుతుంది..ఎక్కడెక్కడకి చేరుకుంటుంది..చివరికి ఎక్కడ ఎండ్ ఉంటుంది అనే ఆసక్తికరమైన విషయాలను వారణాసి సినిమా నుంచి పంచుకున్నారు. మహేష్ ఇందులో రుద్ర పాత్రలో నటిస్తూ..కొద్దిసేపు శ్రీరాముడి అవతారంలో కనిపించబోతున్నాడు.

ప్రపంచదేశాలలో 120 చోట్ల 20 ప్రధాన భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక, ఈరోజు మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో మన టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ సహా పలువురు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వీరందరికీ భిన్నంగా మహేష్ తో దిగిన సెల్ఫీ పిక్ ని షేర్ చేసి ప్రియాంక కూడా బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, వారణాసి సినిమాను 2027, ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నారు.












