తెలంగాణ

Hyderabad: జస్టిస్ సూర్యకాంత్‌కు విద్యార్థుల సెగ.. ఇరకాటంలో నల్సార్‌ యాజమాన్యం!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టిస్ 86వ స్నాతకోత్సవానికి ఈ నెల 2న జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే క్యాంపస్‌లో నిరసనలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం అనూహ్యంగా వాయిదా పడింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు విద్యార్థుల సెగ తగిలింది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించవద్దంటూ దాదాపు 450 మంది విద్యార్థులు యాజమాన్యానికి లేఖ రాసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

2026 బ్యాచ్ స్నాతకోత్సవ తేదీ, ముఖ్య అతిథి వివరాలను నల్సార్ యాజమాన్యం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సీజేఐని స్నాతకోత్సవానికి ఆహ్వానించడం నల్సార్‌లో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను ఆహ్వానించకూడదని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు కారణం.. ఢిల్లీలో జరిగిన నీట్ నిరసనల పై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే అని అంటున్నారు.

జూలై 22న నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరును సవాల్ చేస్తూ.. ఈ కేసును సుమోటోగా విచారణ చేపట్టాలని కోరిన అంశంపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. ఈ సందర్భంగా వీడియోలపై ఆసక్తి లేదని, వాటిని చూసేందుకు సమయం లేదని, తమ సమయాన్ని వృథా చేయవద్దని సీజేఐ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఈ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు..

ఈ నేపథ్యంలో సూర్యకాంత్‌ను తమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం సరికాదని యూనివర్సిటీ యాజమాన్యాన్ని కోరుతున్నారు. తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే స్నాతకోత్సవానికి వారం రోజుల ముందు నిరసన చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని విద్యార్థులు హెచ్చరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టిస్ 86వ స్నాతకోత్సవానికి ఈ నెల 2న జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది.

అయితే క్యాంపస్‌లో నిరసనలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పుడు నల్సార్‌లోనూ ఇదే తరహా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతం సీజేఐ సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తారా? లేక విద్యార్థుల డిమాండ్‌కు యాజమాన్యం స్పందిస్తుందా? అనే అంశం ఆసక్తికరంగా మారింది..

#Hyderabad#NALSAR University#Students#against#Justice Surya Kant
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి